ఆ సినిమాలో చేసి కెరియర్ నాశనం చేసుకున్న వైష్ణవి చైతన్య..!!

ఈ మధ్యకాలంలో పలు రకాల యూట్యూబ్ , షార్ట్ ఫిలిమ్స్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు ఎక్కువగా సినిమాలలో అవకాశాలను అందుకుంటు ఉన్నారు. అలా ఇప్పటివరకు బుల్లితెర వెండితెర మీద చాలామంది సెలబ్రిటీలుగా పేరుపొందారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు.. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ తో కలిసి సాయి రాజేష్ డైరెక్షన్లులో వచ్చిన బేబీ సినిమాతో ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది.

చిత్ర బృందానికి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంలో వైష్ణవి బోల్డ్ క్యారెక్టర్ చేసినందుకు సినిమా భారీగానే సక్సెస్ అయ్యింది. కానీ ఈమెను అభిమానించే వారి సంఖ్య కంటే ద్వేషించే వారి సంఖ్య ఎక్కువగానే పెరుగుతోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో నటించి చాలా పెద్ద తప్పు చేశానని తెలియజేసినట్లు తెలుస్తోంది.అనవసరంగా ఈ సినిమాని ఒప్పుకున్నానని.. తనకు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లలో చేసుకుంటూ ఉంటే మంచి అవకాశాలు వస్తూ ఉండేవి..

కానీ హీరోయిన్గా వచ్చిన తర్వాత పెద్దగా ఆఫర్స్ లేపకపోవడంతో షార్ట్ ఫిలిమ్స్ చేయలేక ఇటు సినిమాలలో చేయలేక ప్రస్తుతం ఖాళీగా ఉన్నానని తన స్నేహితులతో చెప్పిందట.. మళ్లీ SKN ప్రొడక్షన్ హౌస్ లో తనకు మరో సినిమా చేసే అవకాశం ఇస్తారా లేదా అనే విషయం ఇంకా తెలియలేదట. కానీ డైరెక్టర్ సాయి రాజేష్ ఆనంద్ దేవరకొండ మాత్రం వరుస సినిమాలో చేస్తూ బిజీగా ఉన్నారు కాని వైష్ణవి చైతన్య పరిస్థితి ప్రశ్న గానే మారిపోయింది.