చీరకట్టుతో మత్తెక్కిస్తున్న యాపిల్ బ్యూటీ…..పిక్స్ మామూలుగా లేవుగా!

వివాహానంతరం హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి అంటుంటారు సినీ విశ్లేషకులు. ఐతే ఇది వట్టి బూటకం అని రుజువు చేస్తున్నారు నేటి తారలు. మొన్న సమంత, నిన్న నయనతార, ఇప్పుడు యాపిల్ బ్యూటీ హన్సిక. గత ఏడాది డిసెంబర్ లో తన స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతూరియా ను వివాహం ఆడింది హన్సిక. అందువలన ఒక ఏడాది తన సినీ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఒక ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న హన్సిక, వివాహానంతరం మళ్ళీ సినిమాలు చెయ్యడం మొదలుపెట్టింది. వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

ఈరోజు హంసిక నటించిన “మై నేమ్ ఈస్ శృతి” అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఒక అదిరిపోయే ఫోటో షూట్ లో పాల్గొంది హన్సిక. ఈ ఫోటో షూట్లో సారీ లో దర్శనమిచ్చింది యాపిల్ బ్యూటీ. హన్సిక అందానికి చీర కట్టు తోడయ్యి, ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. ఫోటో షూట్ తో పాటు మీడియా ఇంటరాక్షన్ లో కూడా పాల్గొంటోంది హన్సిక. ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది హన్సిక. ఈ ఫోటోలలో అందమైన చీరతో, స్లీవ్ లెస్ బ్లౌజ్ తో పిచ్చేక్కించింది ఈ అమ్మడు. తనను ఈ ఫోటోలలో చూస్తే ఎవరికైనా హార్ట్ బీట్ పెరగాల్సిందే అనేలా చేసింది హన్సిక.

వివాహానంతరం ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది హన్సిక. ఐతే ఇలా చీరకట్టుతో దర్శనమివ్వడం ఇదే మొదటిసారి. ఇక సినిమా విషయానికొస్తే, “మై నేమ్ ఈస్ శృతి” చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. హన్సిక హీరోయిన్ గా శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం “మై నేమ్ ఈస్ శృతి”. ఈ చిత్రంలో హన్సిక నటనకు ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రం అనంతరం హన్సిక గురు శరవణన్ దర్శకత్వంలో “గార్డియన్”, జె ఏం రాజా దర్శకత్వంలో “రౌడీ బేబీ” చిత్రాలలో నటిస్తోంది.