టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు ఎన్నో సేవా సంస్థలకు తన సహాయం అందిస్తూ కష్టాల్లో ఉన్న వారికి చేయూతగా నిలిచాడున గతంలో చాలామంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా మారాడు. అదేవిధంగా ఎంతో మంది పేద పిల్లలను చదివిస్తూ కోట్లాదిమంది ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య కూడా మహేష్ బాటలోకి అడుగు పెట్టాడు. ఇటీవల చిల్డ్రన్స్ డే సందర్భంగా క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిపాడు. వారితో కొంత సమయాన్ని గడిపి వారి ముఖాల్లో చిరునవ్వును తెప్పించాడు.
ముఖ్యంగా ఆ పిల్లలతో ఆటలాడుకుంటూ హ్యాపీగా తన టైం స్పెండ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక పిల్లలకు అవసరమైన మెడిసిన్ కూడా అందించాడట చైతు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మాజీ భార్య సమంత కూడా ఇలాగే గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలను తన ట్రస్ట్ ద్వారా అందిస్తూ ఉండేది.. ఆమెతో అలవాటైన సేవా కార్యక్రమాలను ఇప్పటికి చై కొనసాగిస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరు మహేష్ బాబు బాటలోనే నాగచైతన్య కూడా అడుగులు వేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఏది ఏమైనా నాగచైతన్య చేస్తున్నది మంచి పని కావడంతో నెటిజన్ల నుంచి నాగచైతన్యకు ప్రశంసలు అందుతున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం నాగచైతన్య వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నాడు. తాజాగా తను నటించిన దూత వెబ్ సిరీస్ ఓటీటీ వేదికపై రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అదేవిధంగా తన 23వ సినిమాకు భారీగా కసరత్తులు చేస్తూ కష్టపడుతున్నాడు చైతన్య. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాకు సాయి పల్లవి హీరోయిన్గా నటించబోతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో లవ్ స్టోరీ సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది.