ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు స్టార్ సెలబ్రిటీస్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న జంట ఎవరో గుర్తుపట్టారా. వీరిద్దరూ స్టార్ సెలబ్రిటీసే. ఒకరు స్టార్ హీరోయిన్ కాగా మరొకరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ గతంలో పలు సినిమాల్లో నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. పక్కన ఉన్న వ్యక్తి ఓ స్టార్ డైరెక్టర్. ప‌లు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇంతకీ వీరిద్దరూ ఎవరో గుర్తుపట్టారా..? ఈమె చెన్నై బ్యూటీ సంగీత.

 

తెలుగులో ఎన్నో సినిమాలకు హీరోయిన్గా నటించింది. పెళ్ళాం ఊరెళితే. నవ్వుతూ బతకాలిరా. మా ఆయన చంటి పిల్లాడు. శివపుత్రుడు. విజయేంద్ర వర్మ. సంక్రాంతి లాంటి హిట్ సినిమాలు లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మహేష్ బాబు సరిలేరు నీకెవరుతో రియంట్రి ఇచ్చింది. చిరంజీవి ఆచార్య మూవీ లోను మెరిసింది. అలాగే పలు సినిమాల్లో నటించి మంచి అవకాశాలను అందుకుంటుంది.

ఇక సంగీతంతో ఉన్న ఆ వ్య‌క్తి ఓ స్టార్ డైరెక్టర్. అత‌డు ఎవరంటే నాగచైతన్యతో కస్టడి సినిమాను రూపొందించిన వెంకట ప్రభు. అంతకుముందు సరోజా, గోవా, గ్యాంబ్లర్, బిర్యాని వంటి మంచి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం విజయ్‌ద‌ళ‌పతితో ఓ మూవీ రూపొందిస్తున్నాడు. ఇక వెంకట ప్రభు, సంగీత మొదటి నుంచి చాలా మంచి స్నేహితులు. ఇటీవల వెంకట ప్రభువు పుట్టినరోజు సందర్భంగా సంగీత అత‌డికి విష్ చేస్తు ఈ అరుదైన పిక్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.