బీరకాయ తినడం వల్ల బరువు తగ్గుతారా…!!

ముఖ్యంగా చెప్పాలి అంటే అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు.. బరువు తగ్గాలనుకునేవారు పలు రకాల డైట్లను ఫాలో అవుతూ ఉంటారు. అలా డైట్ ఫాలో అవ్వాలనుకునేవారు బీరకాయ ను ట్రై చేస్తే కచ్చితంగా ఫలితం లభిస్తుందట ఇందులో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఉంటుంది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఇందులో ఫైబర్ ,విటమిన్ సి, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వాస్తవానికి ఇందులో వాటర్ కంటెంట్ కూడా చాలా పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఇవి కడుపులో మంటను శరీర బరువును సైతం అదుపులో ఉంచేలా చేస్తాయి. బీరకాయల వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే బరువు తగ్గడానికి బీరకాయ చాలా రకంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే క్యాలరీలు సంతృప్తి కొవ్వులు కూడా తగిన మోతాదులోనే లభిస్తాయి.

పీచు పదార్థాలు నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల బీరకాయను ఆహారంలో భాగంగా అప్పుడప్పుడు తింటూ ఉండడం వల్ల ఆకలి వేయదు. ఫలితంగా అధిక బరువును సైతం దూరం అయ్యేలా చేస్తుంది. ఇందులో ఐరన్ మెగ్నీషియం జింక్ వంటివి ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని సైతం పెంచడానికి బీరకాయ చాలా ఉపయోగపడుతుంది. అలాగే కాలేయం కడుపు మంట మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్ వంటి వాటిని దూరం చేస్తాయి.

బీరకాయ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇందులో ఉండే పొటాషియం హృదయనాల వ్యవస్థను మరింత ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.డయాబెటిస్ రోగులకు కూడా బీరకాయ ఆరోగ్య ఔషధం అని నిపుణులు తెలుపుతున్నారు. గ్లైసిమిక్ ఇండెక్స్ బీరకాయలో ఉండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేలా చేస్తుంది.