వరుణ్ – లావణ్య పెళ్లికి మెగా ఫ్యామిలీ ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?

టాలీవుడ్ ప్రేమ జంట వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రేమ పక్షులుగా విహరిస్తున్న ఈ జంట నిన్న వివాహ బంధంతో భార్యాభర్తలుగా ప్రమోట్ అయ్యారు. మాస్టర్ మూవీ షూటింగ్ ఇటలీలో జరుపుకుంటున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమ మొదలైంది ఇటలీలోనే కాబట్టి దానికి సింబాలిక్ గా ఇటలీలోనే నవంబర్ 1 అంగరంగ వైభవంగా వీరు పెళ్లి చేసుకున్నారు. మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వార్త ప్రస్తుతం నట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ భారీగా ఖర్చు చేసిందట. కాక్‌టైల్, హల్ది, మెహందీ, పెళ్లి.. ఇలా ప్రతి వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన మెగా ఫ్యామిలీ వాల్ళ‌ కుటుంబాల‌కే కాకుండా వచ్చిన అతిథులందరికీ గుర్తుండిపోయేలా ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

అందుకే ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా.. ఎక్కడ ఏ లోటు లేకుండా.. ఏర్పాటు చేశారట. నెట్టింట వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ పెళ్లికి ఏకంగా రూ.17 కోట్ల వరకు ఖర్చయిందట. విదేశాల్లో జరిగిన పెళ్లికి ఈ రేంజ్ లో ఖర్చు చేశారంటే హైదరాబాద్‌లో న‌వంబ‌ర్ 5న జరగబోయే రిసెప్షన్‌కు ఇంకెంత భారీగా ఖర్చు చేస్తారో అని నెట్టిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో నాగబాబు ఏకైక కొడుకు కాబట్టి ఈ రేంజ్ లో ఖర్చు చేయడం తప్ప ఏమీ లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.