అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో దెస సినీ రంగంలో సునామి సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడీ వంగ. ఈ రెండు చిత్రాలు భారీ విజయాన్ని సాధించడంతో పాటు, ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నాయి. దాంతో సందీప్ చెయ్యబోయే త్తరువాతి చిత్రం పై ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. సందీప్ దర్శకత్వం వహించిన “యానిమల్” చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని డిసెంబర్ 1 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ రన్బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. అనిల్ కపూర్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టోప్పబుల్ షో లో పాల్గొన్నారు. తాజాగా యు ట్యూబ్ లో విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమో, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ షో ప్రోమో లో అందర్నీ ఆకర్షించిన విషయం, రబీర్ కపూర్ మన బాలయ్య డైలాగ్ చెప్పడమే. బాలయ్య లెజెండ్ చిత్రంలోని “ఫ్లూటు జింక ముందు ఊదు..సింహం ముందు కాదు” డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఇదే డైలాగ్ ని ఇప్పుడు రబీర్ బాలయ్య సమక్షంలో చెప్పాడు. అది కూడా భాషలో ఎటువంటి లోపాలు లేకుండా చెప్పాడు. అక్కడితో ఆగకుండా ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్, ది ట్రబుల్ విల్ ట్రబుల్ యు…అయామ్ నాట్ ది ట్రబుల్, అయామ్ ది ట్రుథ్ అంటూ మరో పవర్ఫుల్ బాలయ్య డైలాగ్ కూడా చెప్పాడు. అదే ఊపులో బాలయ్య పైసా వసూల్ పాటకు స్టెప్పులు కూడా వేసాడు. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.
ఈ షో చరిత్రలో మోస్ట్ వైల్డ్ ఎపిసోడ్ ఇదే అవుతుంది అంటున్నారు అభిమానులు. మరోవైపు యానిమల్ ట్రైలర్ ను నిన్న విడుదల చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ లో రబీర్ యాక్టింగ్, సందీప్ దర్శకత్వం తో పాటు అద్భుతమైన మ్యూజిక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యు ట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.