Mega -156 మూవీ టైటిల్ వచ్చేసిందోచ్..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 156 వ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని UV క్రియేషన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ సినిమా అని చాలా గ్రాండ్ గా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో సినిమా షూటింగ్ని మొదలుపెట్టారు. ప్లాన్ ప్రకారమే చిత్ర యూనిట్ సభ్యులంతా కూడా త్వరలోనే ఈ సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెడతారు అనే విషయంపై చాలామంది అభిమానులు ఆత్రుతగా ఎదురు చూశారు.

అయితే ఈ సినిమా ఫాంటసీ అడ్వెంచర్ సినిమా గా ఉండబోతుందని గట్టిగా టాక్ వినిపిస్తోంది గతంలో కూడా డైరెక్టర్ బింబిసారా సినిమాతో అదే రూట్ లోనే వెళ్లి మంచి విజయాన్ని అందుకున్నారు.. దీంతో చిరంజీవికి కూడా అలాంటి కథనే చెప్పి వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా చేసుకున్నారు డైరెక్టర్ వశిష్ట ఇప్పుడు ఈ సినిమా పైన భారీగా అంచనాలైతే పెరిగిపోయాయి. చాలాకాలం తర్వాత జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలోని ఈ సినిమా కథ ఉండబోతుందని రూమర్స్ కూడా వినిపించాయి.

తాజాగా ఈ సినిమాకి విశ్వంభరా అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఇప్పుడు తాజాగా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాకు లోకేషన్ కు సంబంధించి కొన్ని ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.ఇందులో ఒక షూటింగ్ క్లబ్ బోర్డు పైన విశ్వంభరా అనే టైటిల్ ఉండడంతో ఇక టైటిల్ ఇదే ఫిక్స్ అని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం 2025 సంక్రాంతి బరిలో తీసుకువచ్చే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట.