” యానిమల్ ” సినిమా కోసం పడరాని పాట్లు పడుతున్న రష్మిక… అమ్మ బాబోయ్…ఏకంగా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పిందా…!!

రష్మిక మందన ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక కన్నడ సినిమా ” కిర్రాక్ పార్టీ” తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో బిజీగా కెరీర్ ను కొనసాగిస్తుంది.

ఇక మొత్తానికి ” పుష్ప ” సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న ఈమె.. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ” యానిమల్ ” సినిమాతో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఈ మూవీపై హైప్స్ పెంచే క్రమంలో సక్సెస్ అయ్యారు.

ఇక తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వర్షం ట్రైలర్స్ చూసిన ప్రేక్షకులు.. రష్మికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏకంగా నాలుగు భాషల్లో తన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పుకున్న ఈమె.. సినిమా కోసం పూర్తిస్థాయిలో కష్టపడిందని.. లాంగ్వేజెస్ లో వాయిస్ బెస్ట్ గా ఉందని పొగిడేస్తున్నారు. ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తే కచ్చితంగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటుందని రష్మిక కు ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.