వామ్మో… మంచు లక్ష్మి వస్తే హైదరాబాద్ పోరగాళ్లు క్యూ కడతారట… మంచు అక్కకి ఓ రేంజ్ లో ఊహలు ఉన్నాయిగా…!!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి..” అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి, చందమామ కథలు ” సినిమాలలో నటించి విమర్శలు, ప్రశంసలు కూడా అందుకుంది. అయితే అంతకు ముందే పలు అమెరికన్ టీవీ సిరీస్ లు చేసిన ఈ ముద్దుగుమ్మ.. రీసెంట్ గా మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

లెస్బియన్ గా నటించి క్రిటికల్ అప్లాజ్ అందుకుంది. ఇదంతా పక్కన పెడితే… ఈమె హైదరాబాద్ నుంచి ముంబైకి మాకం మార్చేసింది. ఎందుకని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే…” హైదరాబాద్లో నన్ను చూసి అందరూ లేచి నుంచుంటారు. ఇక్కడ నన్ను నేను పరిచయం చేసుకోవాలి. పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి ” అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం మంచు లక్ష్మి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు…” మంచు అక్కకి ఓ రేంజ్ లో ఊహలు ఉన్నట్టున్నాయిగా… మరి హైదరాబాద్లో ఉండే సెలబ్రిటీలకు లేని ప్రాబ్లం ఈమెకు మాత్రమే ఎందుకు వచ్చింది ” అంటూ ఫైర్ అవుతున్నారు.