నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లా ఎందుకు స్టార్ కాలేదు..? అందుకు ఐదు కారణాలు ఇవేనా..!

నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోలుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్టార్ హీరోలు కొనసాగుతున్నారు. వీరిలో ఎన్టీఆర్ మాత్రం గ్లోబల్ హీరోగా భారీ క్రేజ్ అందుకొని సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. కళ్యాణ్ రామ్ కూడా ఇటు హీరోగా సినిమాలు చేస్తూ మరొ ప‌క్క‌ నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇక ఇక కళ్యాణ్ రామ్ బింబిసార‌ సినిమాతో మరోసారి తన అభిమానిని ఖుషి చేస్తూ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు.

 

2002 తొలిచూపుతో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ అదే సమయానికి ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గానే కాకుండా గ్లోబల్ హీరోగా క్రేజ్‌ తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు తార‌క్‌. కానీ కళ్యాణ్ రామ్ చాలా సినిమాలు చేసిన అందులో చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం లేవనే చెప్పాలి. కళ్యాణ్‌రామ్ నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోక్క‌పోవడానికి ఐదు కారణాలు ఉన్నాయని టాలీవుడ్ లోని సినీ విశేషకులు అంటున్నారు. ఆ కారణాలు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.

ఎన్టీఆర్ చూడాలని ఉంది సినిమాతో తెలుగులో ఎంట్రీ వ‌చ్చాడు. ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. కానీ ఆ త‌ర‌వాత వ‌చ్చిన స్టూడెంట్ నంబ‌ర్ 1న్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న డ్యాన్స్ డైలాగుల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఆ త‌ర్వాత‌ వ‌రుస విజ‌య‌ల‌ను అందుకున్నాడు. కానీ క‌ల్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభంలో క‌థ‌ల ఎంపిక‌లో త‌డ‌బ‌డ్డాడు. దాంతో వ‌రుస ఫ్లాప్ లు ప‌డ్డాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ చూడ్డానికి అన్న‌గారిలా ఉన్నార‌ని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిసింది. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ మ‌న‌వ‌డిగా ఎక్కువ‌గా క్రేజ్ ను సంపాదించుకున్నారు.

 

కానీ క‌ల్యాణ్ రామ్ విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు. ఎన్టీఆర్ కేవ‌లం న‌ట‌న పై మాత్ర‌మే దృష్టి పెట్టాడు. కానీ క‌ల్యాణ్ రామ్ మాత్రం సినిమాలను నిర్మించ‌డం కూడా చేసి న‌ట‌న‌పై స‌రిగ్గా ఫోక‌స్ పెట్ట‌లేక‌పోయాడు. అంతే కాకుండా ఎన్టీఆర్ ఎక్కువ‌గా క‌లుపుగోలు మ‌నిషి ఎవరితో అయినా ఇట్టే క‌లిసిపోతాడు. ఎన్టీఆర్ మాట‌కారి కూడా దాంతో త‌న మాట‌ల‌తో ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. కానీ క‌ల్యాణ్ రామ్ మాత్రం సైలెంట్…పెద్ద‌గా మాట్లాడ‌రు. ఇలా క‌ల్యాణ్ రామ్ కు స్టార్ స్టేట‌స్ రాక‌పోవ‌డానికి అనేక కార‌ణాలున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.