చెత్త రీజ‌న్ తో ర‌ష్మిక రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక మంద‌న్నా కెరీర్‌ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రష్మిక.. ఎంత గట్టి పోటీ ఉన్నా సరే చేతినిండా సినిమాలతో మోస్ట్ బిజీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇకపోతే రష్మిక తన కెరీర్ లో చాలా సినిమాలను వదిలేసుకుంది. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ `అరవింద సమేత వీర రాఘవ` కూడా ఒకటి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించారు. జగపతిబాబు, నవీన్ చంద్ర, నాగబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2018 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా రష్మిక నటించాల్సింది.

కానీ, చెత్త రీజన్ తో ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. పూజా హెగ్డే కంటే ముందే త్రివిక్ర‌మ్ హీరోయిన్ పాత్ర కోసం ర‌ష్మిక‌ను సంప్ర‌దించారు. అయితే అప్ప‌టికే చేతి సినిమాలు ఉన్న ర‌ష్మిక‌.. డేట్స్ ఖాళీగా లేవ‌ని చెప్పింద‌ట‌. ఇష్టంలేక‌పోయినా స‌రే ఎన్టీఆర్ మూవీని రిజెక్ట్ చేసింది. అలా ర‌ష్మిక నుంచి చేజారిన అర‌వింద స‌మేత‌.. పూజా హెగ్డే ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా ప‌డింది.