ఎలిమినేష‌న్ భ‌యంతో అమ‌ర్.. ధైర్యం చెబుతున్న శివాజీ..!!

బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇప్పటికే ఉన్న ఎనిమిది మందికి గట్టి పోటీ ఇచ్చారు. ఏకంగా రెండు గేమ్స్ లో గెలిచారు. ఇది కాదన్నట్లు గత 36 గంటలుగా సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు అమరదీప్ కి ఎలిమినేషన్ భయం పుట్టుకుంది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నామినేషన్ పూర్తి కావడంతో శనివారం ఎపిసోడ్ పూర్తయింది. మళ్లీ అక్కడి నుంచి మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. ఇది జరగడానికి కాసేపటి ముందు సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

వస్తునే ” అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ ” అని కాస్త హడావిడి చేశాడు. మనోడికి సీక్రెట్ రూమ్ లో పెట్టడమే కాస్త అతిగా అనిపిస్తే.. బయటకొచ్చాక చేసిన హంగామా నవ్వుకునేలా చేసింది. ఇకపోతే గౌతమ్ ఆటగాళ్లలో కాకుండా పోటుగాళ్లలో ఒకడుగా ఉండాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఈవారం నామినేషన్స్ లో ఉన్నవారు అమర్దీప్, యావర్, తేజ, శోభ శెట్టి, నయని, అశ్విని, సందీప్, పూజ ఉన్నారు. అయితే వీళ్లల్లో ఒకరిని సేవ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా నామినేట్ చేసే అవకాశం గౌతమ్ కి బిగ్ బాస్ ఇచ్చాడు. దీంతో అతడు సందీప్ ని సేవ్ చేశాడు. ఈ క్రమంలోని శివాజీ తో మాట్లాడిన గౌతమ్.. ఎంటర్టైన్మెంట్ చేయలేదని చెప్పి బయటకు పంపించేశారు.

ఎంటర్టైన్మెంట్ అంటే ప్యాంటు తీసి తిరగడమా అన్న అంటూ శివాజీపై సీరియస్ అయ్యాడు. దీని గురించి ఇద్దరి మధ్య కాసేపు వాదోపవాదాలు జరిగాయి. అనంతరం ఐదు వారాల నుంచి ఉన్నవాళ్లందరూ ఆటగాళ్లు.. కొత్త‌గా వ‌చ్చిన వాళ్లంద‌రూ పోటుగాలుగా విభజించి ” హౌ ఈజ్ ద బెస్ట్ ” టాస్క్ లో తలపడాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇందులో పోటుగాళ్లు గలిచారు. అనంతరం ” హౌ ఈజ్ జీనియస్ ” గేమ్లో అడాలని వెళ్లిన అమర్దీప్.. సరైన సమాధానాలు చెప్పలేక మధ్యలోనే వచ్చేసాడు. అతడి బదులు తేజ గేమ్ పూర్తి చేశాడు. ఇందులో కూడా పోటుగాళ్లే గలిచారు.

దీంతో ఈ గేమ్ పూర్తయిన తర్వాత అమర్దీప్ పూర్తిగా డిస్ పాయింట్ అయ్యాడు. ఈవారం బయటకు తోసేస్తారేమో అనిపిస్తుందని శివాజీ తో మాట్లాడుతూ అమర్దీప్ భయపడ్డాడు. ఇది జరగడానికి కాసేపటి ముందు కొత్తగా వచ్చిన పూజా మూర్తి, అమర్ దగ్గరకొచ్చి..” బయట చూసిన అమర్ వేరు.. ఇక్కడ చూస్తున్న అమర్ వేరు ” అని అతడితో చెప్పింది. ఈ ఎపిసోడ్లో అయితే అమర్దీప్ ముఖంలో ఎలిమినేషన్ భయం కనిపిస్తుంది. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు చూడాలి మరి.