`టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` 5 డేస్ క‌లెక్ష‌న్స్.. మిక్స్డ్ టాక్ తోనూ ర‌వితేజ క‌మ్మేస్తున్నాడు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ రీసెంట్ గా `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. స్టువర్టుపురంలో గ‌జ‌దొంగ‌గా పేరు తెచ్చుకున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత క‌థ ఆధారంగా డైరెక్ట‌ర్ వంశీకృష్ణ నాయుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.

అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైంది. కానీ, అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. మొద‌ట ఆట నుంచే మిక్స్డ్ టాక్ ల‌భించింది. అయినా కూడా ద‌స‌రా పండ‌గ అడ్వాంటేజ్ తో ర‌వితేజ బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేస్తున్నారు. తాజాగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు 5 డేస్ క‌లెక్ష‌న్స్ లెక్క బ‌య‌ట‌కు వ‌చ్చింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 38.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు.. 5 రోజుల ర‌న్ కంప్లీట్ అయ్యే స‌మ‌యానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ. 15.01 కోట్ల షేర్, రూ. 25.45 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 18.16 కోట్ల షేర్‌, రూ. 33.30 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇంకా రూ. 20.34 కోట్ల షేర్ వ‌సూళ్లు వ‌స్తే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు క్లీన్ హిట్ అవుతుంది. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ రేంజ్ క‌లెక్ష‌న్స్ రావ‌డం క‌ష్ట‌మే. ఇక ఏరియాల వారీగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం: 5.40 కోట్లు
సీడెడ్: 2.70Cr
ఉత్త‌రాంద్ర‌: 1.64 కోట్లు
తూర్పు: 1.20 కోట్లు
పశ్చిమ: 0.77 కోట్లు
గుంటూరు: 1.68 కోట్లు
కృష్ణ: 1.01 కోట్లు
నెల్లూరు: 0.61 కోట్లు
————————
ఏపీ+తెలంగాణ‌= 15.01కోట్లు(25.45కోట్లు~ గ్రాస్‌)
————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.65 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 1.50 కోట్లు
————————
వ‌ర‌ల్డ్ వైడ్ = 18.16 కోట్లు (33.30కోట్లు~ గ్రాస్)
————————