విజయశాంతి పేరు వెనుక అంత మిస్టరీ ఉందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ విజయశాంతి.. ఎన్నో చిత్రాలలో తన నటనతో మెప్పించిన ఈమె టాలీవుడ్లో మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ సినిమాలను కూడా మొదలు పెట్టింది. మొట్టమొదట కోటి రూపాయలు అందుకున్న రెమ్యూనరేషన్ మహిళ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఒకానొక సమయంలో విజయశాంతికి పోటీగా సినిమాలో విడుదల చేయాలి అంటే బడా హీరోలే చాలా ఇబ్బందులు పడేవారట. అలా ఎన్నో చిత్రాలలో యాక్షన్ ఎపిసోడ్లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.

అలా విజయశాంతి లేడీ అమితాబ్ గా కూడా గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంది. తనకు ఏదైనా పాత్ర నచ్చితే చేస్తుంది తప్ప మరే సినిమాలో కూడా నటించలేదు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి 45 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో ఏళ్ల తర్వాత మహేష్ నటించిన సరిలేరునీకెవ్వరు అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఒక సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

విజయశాంతి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే జూన్ 24 1966 లో ఈమె జన్మించింది. ఈమె పేరు వెనక ఒక స్టోరీ ఉందట విజయశాంతి అసలు పేరు శాంతి అట.. ఈమె పిన్ని పేరు విజయలలిత కావడంతో పాటు ఈమె గతంలో నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.ఆమె ప్రోత్సాహంతోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి 7వ సంవత్సరంలోని బాలనటిగా మంచి పాపులారిటీ అందుకుంది.. తమిళ డైరెక్టర్ భారతి రాజా శాంతి పేరును విజయశాంతి అని తన పిన్ని విజయలలిత పేరులోని విజయ అనే పేరును తీసుకువచ్చి యాడ్ చేసి పరిచయం చేశారట. ఈమె పేరు విజయశాంతి గా మారిపోయిందట. తెలుగులో తిరుగులేని స్టార్ హీరోయిన్గా పాపులారిటీ అందుకున్నది.