చంద్రబాబు అరెస్టుపై అందుకే ఎన్టీఆర్ మౌనం..రాజీవ్ కనకాల కామెంట్స్..!!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే గత కొద్దిరోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని పలువురు కార్యకర్తలు సైతం టిడిపి నాయకులు సైతం ఎన్టీఆర్ పైన పలు రకాల కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా తనని దూషించడం కూడా జరుగుతోంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం వీటికి దిటుగానే సమాధానాలు తెలుపుతూ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందని ఆరోపణల పై చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటికీ నెలదాక చంద్రబాబుకు బెయిల్ లభించకపోవడంతో పలువురు టిడిపి నాయకులు సైతం చాలా చోట్ల బందులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఈ విషయానికి కాస్త మైనస్ గా మారిపోయింది. నటుడు రాజీవ్ కనకాల కూడా ఈ విషయం పైన తాజాగా స్పందించారు.

తాజాగా తన కుమారుడి సినిమా లాంచింగ్ సందర్భంగా ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ రాజీవ్ కనకాల మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న వ్యవహారాలపైన ఎన్టీఆర్ స్పందించకపోవడానికి వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండడమే కారణం అయ్యుంటుందంటూ తాను తెలియజేయడం జరిగింది. RRR సినిమా మధ్యలో కరోనా గ్యాప్లో ఎన్టీఆర్ ఖచ్చితంగా నాలుగు సినిమాలైనా చేసేవారు కానీ కేవలం దేవరాజ్ సినిమాలో మాత్రమే నటిస్తూ ఉన్నారు. రాజీవ్ కనకాల కూడా రాజకీయాలలోకి ఎప్పుడు వస్తారని ప్రశ్న ఎదురవ్వగా తాను రాజకీయాలకు సమయం కేటాయించగలరు అనుకున్నప్పుడే కచ్చితంగా వస్తానని తెలిపారు.