ఆ నటుడు చేతిలో దారుణంగా మోసపోయిన ముమైత్ ఖాన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో పలు సినిమాలలో స్పెషల్ సాంగులలో నటించి మెప్పించిన ముమైత్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా పోకిరి సినిమాలో తన డ్యాన్స్ తో అందరిని ఆకట్టుకున్న ముమైత్ ఖాన్ న్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు. బిగ్ బాస్ షోలో కూడా ఎంట్రీ ఇచ్చిన అది కూడా కలిసి రాలేదని చెప్పవచ్చు. అయితే ఈమె ఇలా ఇండస్ట్రీ నుంచి దూరం కావడానికి కారణం ఒక నటుడు అన్నట్టుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

ముమైత్ ఖాన్ కి ఒక ఫంక్షన్ లో ఆలీ సోదరుడు కయ్యూం పరిచయమయ్యారట.. దీంతో వీరి మధ్య మంచి అభిప్రాయం రావడంతో వీరిద్దరూ చాలా రోజులపాటు డేట్ చేశారట.. వీరిద్దరూ వివాహం చేసుకుందామనుకుంటున్న సమయంలో వీరి వివాహానికి సైతం ఇద్దరు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారట. ఆ తర్వాత వీరిద్దరి మధ్య బ్రేక్ అప్ మొదలయ్యిందట. ఆ వెంటనే కయ్యూం వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

అయితే ముమైత్ ఖాన్ మాత్రం ఇప్పటికి ఒంటరిగానే జీవిస్తోంది. ఒకప్పుడు అందరూ స్టార్ హీరోలతో స్పెషల్ సాంగులలో నటించిన ముమైత్ ఖాన్ ఆ మధ్య డ్రగ్స్ తీసుకొందనే వార్తలు కూడా వినిపించాయి.. ఆ తర్వాత సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసుని మూసి వేయడం కూడా జరిగింది.అయినప్పటికీ కూడా ఈమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. దాదాపుగా డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వారందరికీ కూడా అవకాశాలు తెలుగు ఇండస్ట్రీలో చాలానే తగ్గిపోయాయని చెప్పవచ్చు.