ఇలా చేస్తే ఇంట్లో దోమలు పరార్..!!

సాయంత్రం అవ్వగానే చాలామంది ప్రజలు ఎక్కువగా దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఎక్కడ ఉన్నా సరే కుట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.. పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకోవడంతోపాటు పరిసర ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకోవడం వల్ల దోమలు పెరగవు దోమలు ఎక్కువగా చీకటిగా ఉన్న వాతావరణ తేమతో కూడిన ప్రదేశాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అందుచేతనే మన బాత్రూం బాల్కనీలలో నీటిని నిలువ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా వాటిని ఏదైనా వాటితో మూసివేయాలి.


మన ఇంటి చుట్టూ పరిసరాలలో ఏదైనా కాలువలు పైపులు సీలింగ్ మొదలైన వాటిని క్లీన్ గా ఉంచేలా చూసుకోవాలి. లేకపోతే కీటకాలు, బొద్దింకలు ,దోమలు పెరగడానికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి ఎప్పటికప్పుడు అల్మారాలు డ్రాయర్స్ వంటివి క్లీన్ చేస్తూ ఉండాలి.

అదేవిధంగా కెమికల్స్ స్ప్రేలు వాడకుండా కేవలం ఇంట్లో ఉండే సోఫా కూర్చి డైనింగ్ టేబుల్స్ పైన సెనగపిండి బోరిక్ పౌడర్ పంచదార వంటి వాటిని కలిపి కాస్త ఈ నీటిని చిలకరించడం వల్ల దోమల బారి నుంచి దూరం కావచ్చు

అయితే ఏవైనా పురుగు మందులు వాడొచ్చు కానీ దీనివల్ల బొద్దింకలు కీటకాలతో సహా తెగుళ్ళని దూరం చేయవచ్చు వీటిని ఎక్కువగా బాత్రూం బెడ్ రూమ్లలో ఉపయోగించాలి.

కిటికీలు వాడడం వల్ల చాలా దోమలు లోపలి రావడానికి దారి ఉండదు అలాగే సింక్ కాలువలో స్టైనర్స్ పెట్టడం వల్ల బొద్దింకలు పురుగులు కూడా రాకుండా ఉంటాయి.

వీటితోపాటు ఇంట్లో చెత్త పేరుకోకుండా చూడాలి కొబ్బరి బోండాలు కొబ్బరి చిప్పలు వంటివి అసలు ఉంచకూడదు.

ఏదైనా చెట్లు పెంచితే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేస్తూ ఉండాలి కూలర్స్ వేసి వంటి వాటిని తరచూ ఉపయోగిస్తూ ఉండాలి.

దోమల బారి నుంచి తప్పించుకోవాలి అంటే ధూపము లేకపోతే వేపాకు పొగ వంటివి అప్పుడప్పుడు వేస్తూ ఉండడం వల్ల ఉండవు..