భగవంత్ కేసరి హిట్ ..కానీ బాలయ్య ఫ్యాన్స్ అన్ హ్యాపీ..ఎందుకంటే..?

భగవంత్  కేసరి ఇప్పుడు ఎవరి నోట విన్నా సరే ఈ పేరే మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య రీసెంట్గా నటించిన సినిమా నే ఇది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . మరీ ముఖ్యంగా బాలయ్య అభిమానులకు ఈ సినిమా తెగ నచ్చేసింది.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఆయనకు జోడిగా నటించగా శ్రీ లీల కూతురు పాత్రలో కనిపించింది . ఇప్పటివరకు శ్రీ లీల గ్లామరస్ పాత్రలోనే ఎక్కువగా నటించి మెప్పించింది ఈసారి సెంటిమెంట్ పాత్రలో సైతం తన అభిమానులను ఫిదా చేసింది.  సినిమా సూపర్ డూపర్ హిట్.. బాలయ్య నటన ..యాక్షన్ సీన్స్ ..డైలాగ్స్ డెలివరీ ..కేకో కేక. అయినా సరే అభిమానులు ఈ సినిమాను ఫుల్ ఫీల్ గా ఎంజాయ్ చేయలేకపోతున్నారు.

దానికి కారణం ఆయన నటించిన  వీర సింహారెడ్డి సినిమానే.  ఈ సినిమాలో బాలయ్య ఎంత మాస్ లుక్స్ లో కనిపించాడు మనం  చూసాం . చాలా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాడు . అంతేకాదు ఇప్పటికీ మనం కళ్ళు మూసుకొని బాలయ్యను గుర్తు చేసుకుంటే బ్లాక్ కలర్ డ్రెస్ లోనే దర్శనం ఇస్తాడు . అలాంటి బాలయ్యను భగవంత్  కేసరి సినిమా లుక్స్ పరంగా మెప్పించలేకపోయింది . క్యారెక్టర్ ఒకే కానీ బాలయ్య రేంజ్ కి ఈ పాత్ర కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో కొందరు  నందమూరి ఫ్యాన్స్ భగవంత్ కేసరి హిట్ అయినా సరే ఆ సంతోషాని   ఎంజాయ్ చేయలేకపోతున్నారు..!!