HBD: రాజమౌళి ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ కూడా గర్వపడతారు..ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సందడిగా ఉంటుంది. ముఖ్యంగా రాజమౌళి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంటాయి. మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో డైరెక్టర్ గా మారారు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్న రాజమౌళి ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించారు.

RRR director Rajamouli holidays with family in Tamil Nadu's Thoothukudi.  See pics | Telugu News - The Indian Express
ఆ తర్వాత ఎన్టీఆర్ తోనే కలిసి సింహాద్రి సినిమా చేయగా మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. రాజమౌళి కెరియర్ లో సై ,చత్రపతి ,విక్రమార్కుడు, మగధీర ,మర్యాదరామన్న, యమదొంగ, ఈగ ,బాహుబలి సిరీస్, RRR వంటి సినిమాలు చేశారు ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు ఫ్లాప్ గా టాక్ తెచ్చుకోలేదు. ఈ రోజున రాజమౌళి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రాజమౌళి ఆస్తి మొత్తం 250 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమాకి దర్శకత్వం దీనికి 25 కోట్ల రూపాయలు అందుకున్నారు. ఇక RRR చిత్రానికి గాను 50 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. పలు సినిమాలలో వాటాలు కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి రాజమౌళికి హైదరాబాదులో విలాసవంతమైన ఒక ఇల్లు కూడా ఉంది. అలాగే పలు రకాల కార్లు పలు ప్రాంతాలలో ఆస్తులు కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. రాజమౌళి కర్ణాటక ప్రాంతానికి చెందిన. రాజమౌళి మహేష్ బాబు తో కలిసి త్వరలోనే పాన్ వరల్డ్ సినిమాని చేయబోతున్నారు.