టైగర్ నాగేశ్వరరావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఫైట్ మాస్టర్స్.. పూనకాలేనట!!

ప్రముఖ నటుడు మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన ‘ టైగర్ నాగేశ్వరరావు ‘ అనే సినిమాలో నటించారు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇక రామ్ – లక్ష్మణ్ లు యాక్షన్, కొరియోగ్రఫీ చేసారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20 నా ప్రేక్షకుల ముందుకు రాభోతున్న సందర్బంగా రామ్ లక్ష్మణ్ లు సోమవారం రోజు హైదరాబాద్ లో విలేకర్ల తో సినిమా గురించి ముచ్చటించారు.

వారు మాట్లాడుతూ ‘ ఈ కథ మాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే మేము స్టువర్టుపురంలోనే పుట్టిపెరిగాం. చిన్నప్పుడు ఊర్లో టైగర్ నాగేశ్వరరావు గురించి కథలు కథలుగా విన్నాం. ఆయన రన్నింగ్ ట్రైన్ ఎక్కే వారట. అలానే దొంగతనం చేసే ముందు నేను దొంగతనం చేస్తున్నానని చెప్పు మరి చేసే వాడట. అంతేకాకుండా చెట్లపై ఆయన పరిగెత్తే వాడటం. ఇలా టైగర్ నాగేశ్వరరావు గురించి ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలను విన్నాం. దొంగతనం చేస్తానని అందరికి చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. నాగేశ్వరరావు చెన్నై చెన్నై జైలు నుంచి తప్పించుకున్నాడు. స్వయంగా పోలీసులు ఆయనకి టైగర్ అనే బిరుదు ఇచ్చారంటే ఎవ్వరు నమ్మరు. మేము ఒక ఫైట్ సీన్ తీయాలంటే ఎన్నో ఏర్పాట్లు,జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ నాగేశ్వరరావు మాత్రం ఎటువంటి సహాయం లేకుండా జైలు గోడలను అవలీలగా ఎక్కేవారట. ఒక దొంగ అంత ప్రాచుర్యం పొందాలంటే దాని వెనుక ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది’.

‘ రవితేజ తో మేము ఎన్నో సినిమాల్లో కలిసి పని చేసాం కానీ ఈ సినిమా మాత్రం మాకు చాలా కొత్తగా అనిపించింది. టైగర్ నాగేశ్వరరావు పాత్రకు రవితేజ బాగా సెట్ అయ్యాడు. ఈ సినిమాలో ప్రతి యాక్షన్ సీన్ ని ప్రేక్షకులు రియల్ గా ఫీల్ అవుతారు. ఆ సీన్స్ అన్ని నాగేశ్వారరావు నివసించిన చీరాల ప్రాతంలోని జీడి తోటలోనే తీసాం. ఇక ఫైటింగ్ సీన్స్ కోసం రవితేజ చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని రైలు యాక్షన్ సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే ఒక మైలురాయి గా నిలుస్తుంది అని మా నమ్మకం’ అని రామ్ లక్ష్మణ్ చెప్పారు.