జుట్టు వేగంగా పెరగ‌టానికి ఈ సింపు్ల్ టిప్ ఫాలో అయితే చాలు..

జుట్టుకి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఖరీదైన నూనెలను వాడవలసిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఉన్న వస్తువులను ఉపయోగించి నూనెను తయారు చేసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, జుట్టు కుదుళ్ళు బలంగా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టుకు రక్త ప్రసరణ మెరుగుపడడానికి ఒక మంచి నూనెను తయారు చేసుకుందాం.

ఈ నూనె రాయటం వల్ల జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా సాగి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఆ నూనె ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలో ఐదు ఉసిరికాయలను తురుముకుని వేసుకోవాలి.

ఆ తర్వాత గుప్పుడు గోరింటాకు, గుప్పుడు కట్ చేసిన మందార ఆకులు, 100 గ్రాముల మెంతులు, గుప్పుడు గుంటగలగరాకు, గుప్పుడు కరివేపాకు వేసి దానిలో 1/2 కేజీ కొబ్బరినూనె వెయ్యాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి తక్కువ మంటలో పది నిమిషాల పాటు మరగనివ్వాలి. ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు తలకు బాగా రాసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు పెరుగుతూ దృఢంగా ఉంటుంది.