ప్రశాంత్, శోభ , సందీప్ పవర్ అస్త్రను తిరిగి ఇచ్చేయమన్న బిగ్‌బాస్.. ట్విస్ట్ అదిరిపోయిందిగా…!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 ఈసారి ఉల్టా పుల్టా అని నాగార్జున ముందే తెలిపారు. అలాగే ఈ సీజన్ మొదలైన ద‌గ్గ‌ర‌ నుంచి ప్రసారమవుతున్న కొన్ని ఎపిసోడ్స్‌ చూస్తుంటే నిజంగానే ఉల్టా పుల్టా అని అర్థమవుతుంది. పవర్ అస్త్రను సాధిస్తేనే కన్ఫామ్ హౌస్ మేట్ అని బిగ్ బాస్ అన్నాడు. దీంతో నలుగురు సాధించారు. ఇటీవల శివాజీ అనర్హుడు అని హౌస్ మేట్స్ ఓట్లు వేయడంతో పవర్ అస్త్ర నాగార్జున తీసుకుని పగలగొట్టేశాడు.

తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో కన్ఫామ్ కంటిస్టెంట్లకు బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. మీ పవర్ అస్త్రను తిరిగి ఇచ్చేసే సమయం వచ్చిందని బిగ్ బాస్ చెప్పి ఆక్టివిటీ రూమ్ లో ఉన్న ఓ పెట్టిలో మీ పవర్ అస్త్ర ను పెట్టమని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో ముగ్గురు తీసుకువెళ్లి తమ పవర్ అస్త్ర ను అందులో పెట్టేశారు. వాళ్లు పవర్ అస్త్రలు కూడా పోవడంతో శివాజీ చాలా సంతోషపడ్డాడు. ఎయ్ ఎయ్ రో చూస్తవేరో.. పదండ్రా అంటూ డాన్స్ చేశాడు శివాజీ. ఆయన అలా చేయడంపై శోభా శెట్టి సీరియస్ అయ్యింది.

కొందరు ఎవరిదైనా పోతే చాలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేదో అంటారు కదా.. మనకు రాక పోయిన పర్వాలేదు. పక్కన వాళ్లకు రాకపోతే చాలు.. ఛీ.. అంటూ శోభా శెట్టి శివాజీని ఉద్దేశించి మాట్లాడింది. ఆ తర్వాత తనకు కనీసం కాఫీ కూడా ఇవ్వడం లేదని.. హౌస్ మేట్ నుంచి కంటిస్టెంట్ గా మారాక తనకు ఒక కాఫీ కూడా తగలెయ్యలేదని శివాజీ తెగ బాధపడిపోయాడు. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాఫీ కూడా ఇవ్వలేని బతుకు నాది ఓ బతుకేనా…సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అంటూ శివాజీ తెగ బాధ పడిపోయాడు.