ఈ ఆహారంతో థైరాయిడ్ సమస్యకు చెక్ ..

ఇటీవ‌ల కాలంలో చాలా మంది మహిళలను వేధిస్తున్న సాధార‌ణ సమస్య థైరాయిడ్‌. దీనివల్ల జుట్టురాలడం, బరువు తగ్గడం, పెరగడం, రుతుచక్రంలో మార్పులు, గ‌ర్భ‌ధార‌ణ‌లో ఇబ్బందులు వంటి సమస్యలు త‌లెతుత్తాయి. ఆహారపు అల‌వాట్ల‌టో కొన్ని మార్పులు చేసుకుంటే దీన్ని సులువుగా కంట్రోల్ చేయ‌న‌చ్చ‌ని నిపుణులు చెప్తున్నారు.

ఈ సమస్య ఉన్నవారు యాంటీఆక్సిడెంట్లు, బీ12 సమృద్ధిగా ఉండే ఆహారాని తీసుకోవటం ద్వారా థైరాయిడ్‌ను అదుపులో ఉంచ‌వ‌చ్చు. ఇవి ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, బఠాణీలు, నువ్వులు, గుడ్లు, చీజ్ లాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడేలా చేస్తాయి. అవసరమైన థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి తోడ్ప‌డ‌తాయి.
హైపోథైరాయిడిజం ఉన్న వారిలో జీర్ణాశయ సమస్యలు అధికంగా ఉంటాయి.

ఇలాంటి స‌మ‌స్య ఉన్న‌వాళ్లు ప్రోబయాటిక్స్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పెరుగు, చీజ్ లాంటి వాటిల్లో జీర్ణాశయాని మేరుగు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇక ఇవి పొట్టని, పేగుల్ని శుభ్రం చేసి, ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి కచ్చితంగా రోజూ ఓ కప్పు పెరుగు తినడం మంచిది. థైరాక్సిన్‌, టీ4 హర్మోన్లని కంట్రోల్‌చేసి మెటబాలిజాన్ని క్ర‌మ‌వ‌ద్దిక‌రించ‌టంలో సెలీనియం ఉపయోగపడుతుంది. పుట్టగొడుగులు, బ్రౌన్‌రైస్‌, మాంసం, చేపలు, గుడ్లు, పనస గింజల్లో ఇది స‌మృధిగా ఉంటుంది.