ఎయిర్ పోర్ట్ లో డార్లింగ్ చెంప చెల్లుమనిపించిన ఓ అమ్మాయి.. ప్ర‌భాస్‌ షాకింగ్ రియాక్ష‌న్‌..!!

ప్రభాస్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో ప్రభాస్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాతో యావరేజ్ హిట్‌ అందుకున్నాడు. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ” సలార్ ” సినిమా కోసం డార్లింగ్ ఫాన్స్‌లోనే కాకుండా ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకున్నాయి.

స్టార్‌డ‌మ్‌ ఎలా కాపాడుకోవాలో తెలిసిన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రభాస్ కూడా ఒకడు. ఎప్పుడు జనాల్లోకి వచ్చినా.. తనకోసం వచ్చిన అభిమానులను అసలు నిరుత్సాహపరచకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎంత టైం అయినా కేటాయిస్తాడు. ఇక తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో ప్రభాస్ చంపపై ఓ లేడీ ఫ్యాన్ కొట్టడం వైరల్ అవుతుంది. ఎయిర్‌పోర్ట్‌లో ప్రభాస్‌ను చూసిన ఓ లేడీ ఫ్యాన్ ప్రభాస్ తో ఫోటో దిగి.. ఆనందం తట్టుకోలేక ఒక సారి తాకాలనే ఉద్దేశంతో ప్రభాస్ చెంప మీద కొట్టింది. ప్ర‌భాస్ ఆమెను చూస్తు ఓ స్మైల్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింటి వైరల్ గా మారింది.