మా ఆయ‌న కన్నా ఆ ప‌ని నేనే బాగా చేస్తా.. నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు అనసూయ స్ట్రైట్ ఆన్స‌ర్‌!

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకున్న అందాల భామ అన‌సూయ‌.. ప్ర‌స్తుతం ఓవైపు యాంక‌ర్‌గా రాణిస్తూనే మ‌రోవైపు న‌టిగా వెండితెర‌పై వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. పాత్ర‌కు ప్ర‌ధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌ను పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. తాజాగా `పెదకాపు 1` మూవీతో అన‌సూయ ఆడియెన్స్ ను ప‌ల‌క‌రించింది.

ఈ సినిమాలో ఆమె పోషించిన అక్కమ్మ పాత్ర‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో అన‌సూయ ఎంత‌ యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ్లామ‌ర‌స్ ఫోటోలు పంచుకోవ‌డ‌మే కాకుండా త‌ర‌చూ త‌న ఫాలోవ‌ర్స్ తో ముచ్చ‌ట్లు పెడుతుంటుంది. ఎవ‌రైనా నెగ‌టివ్ కామెంట్స్ లో శృతి మించితే మాత్రం.. త‌నదైన శైలిలో క్లాస్ పీకుతుంటుంది.

తాజాగా అన‌సూయ మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఫాలోవ‌ర్స్ తో చిట్ చాట్ చేసింది. `నాకు 40 నిమిషాల టైమ్ ఉంది. ఈ టైమ్‌లో ఎవరైనా, ఏదైనా అడగండి.. ఆన్స‌ర్ ఇస్తాను` అని ఆఫ‌ర్ ఇచ్చింది. దీంతో చాలా మంది పెద‌కాపు 1 గురించి ప్ర‌శ్నలు వేయ‌గా.. కొంద‌రు వ్య‌క్తిగ‌త ప్ర‌శ్న‌లు వేశారు. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ `మీ ఇంట్లో ఎవరు వంట బాగా చేస్తారు..?` అని అడిగాడు. అందుకు అన‌సూయ బ‌దులిస్తూ.. ` వంట విషయంలో మా ఆయన కంటే నేనే బెటర్. భర్తకు ప్రేమగా వండి పెడతాను. ఆయన కూడా వంట చేస్తారు. కానీ ఆయ‌న క‌న్నా నేనే బాగా చేస్తాను` అంటూ స్ట్రైట్ ఆన్స‌ర్ ఇచ్చింది.