తమిళ్‌లో రీమేక్ కానున్న ” బేబీ “.. హీరో ఎవరంటే..?

చిన్న సినిమాగా తెరకెక్కి.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ” బేబీ ” మూవీ. ఈ సినిమా థియేటర్స్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాలో యువ నటుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించగా, విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్రలో కనిపించాడు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 90 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల ప్రశంసలు అందుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అతి త్వరలోనే తమిళంలో రిలీజ్ కాబోతుందట. దర్శకుడిగా సాయి రాజేష్, నిర్మాతగా ఎస్కెఎన్ వ్యవహరించబోతున్నారు.

ఇక కోలీవుడ్ లో ఇలాంటి లవ్ స్టోరీలకు ప్రాణం పోసిన హీరో శింబుని ఈ ప్రాజెక్టు కోసం సంప్రదించగా.. హీరోయిన్ గా ” లవ్ టుడే ” ఫేమ్ ఇవానాను కన్ఫర్మ్ చేసినట్లు టాక్. మరి ఈ సినిమా టాలీవుడ్ దగ్గర అయితే దుమ్ము రేపేసింది. మరి కోలీవుడ్ దగ్గర ఏ రేంజ్ లో వెళ్తుందో చూడాలి మరి.