సైలెంట్ రేసులో దిగి దూసుకుపోతున్న ఆ టాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే..?

ప్రజెంట్ టాలీవుడ్ బిజీ బ్యూటీ ఎవరు..? అంటే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీ లీలా. తాజాగా అదే రేసులోకి సైలెంట్ గా వచ్చి యాడ్ అయిపోయింది మ‌రో యంగ్ బ్యూటి. ఆమె ఎవ‌రోకాదు మీనాక్షి చౌదరి. హిట్ 2, కిలాడి సినిమాలతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి ఈ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఇప్పుడు టాప్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరుకుంది మీనాక్షి. ఆమె చేతిలో ప్రస్తుతం పెద్ద, మీడియం అన్ని రకాల సినిమాలు కలుపుకొని దాదాపు అరడజన్ సినిమాలు ఉన్నాయి.

మహేష్ బాబు గుంటూరు కారంలో హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షి.. విశ్వక్సేతో మెకానిక్ రాఖీ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ప్రారంభమైన దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ లక్కీ భాస్కర్ లో కూడా ఈమె అలరించబోతోంది. వరుణ్ తేజ్ చేయబోతున్న పాన్ ఇండియా ఎంటర్టైనర్ మట్కాలో కథానాయకగా మీనాక్షి కనిపించనుంది.

ఇలా సైలెంట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఒక్కసారిగా మంచి స్పీడ్ తో దూసుకుపోతున్న మీనాక్షికి ఇప్పుడు మరో బిగ్ ఆఫర్ వచ్చింది. విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఇందులో హీరోయిన్గా మీనాక్షిని తీసుకున్నారు. ఇవే కాకుండా ఆమె చేతిలో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌ కూడా ఉన్నాయి. మొత్తానికి వరుస‌ సినిమాలతో శ్రీ లీల తర్వాత టాప్ మోస్ట్ బిజీ హీరోయిన్గా మీనాక్షి చౌదరి మారిపోయింది.