పవన్ సినిమాలో బాలయ్య మరదలు పిల్ల.. ఈ విధంగా కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ .. ప్రజెంట్ ఏపీ రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతున్నాడో మనకు తెలిసిందే . కష్టాల్లో ఉన్న టిడిపికి తన వంతు సహాయంగా జనసేన పార్టీని సపోర్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే బాలయ్య కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నారు . కాగా ఇది ఇలా ఉండగా ఇదే టైంలో పవన్ కళ్యాణ్ సినిమాలో బాలయ్య హీరోయిన్ ని పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది .

వీరసింహారెడ్డి సినిమాతో తెలుగులో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హనీ రోజ్ .. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాత్ భగత్ సింగ్ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపిస్తుందట. అది కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ కావడం గమనార్హం. దీంతో నిన్న మొన్నటి వరకు అసలు ఆఫర్స్ ఏ లెక్క అల్లాడిన హనీరోజ్ ఒక్కసారిగా ఇంత పెద్ద ఆఫర్ రావడం ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది.

అయితే దీనంతటికి కారణం బాలకృష్ణ అని అంటూ కొందరు అంటుంటే .. మరికొందరు హరీష్ శంకర్ ఆమెలోని నటనను చూశాడు అని ..ఆ కారణంగానే ఇంత మంచి రోల్ ఇచ్చారు అని ..దీన్ని కూడా పొలిటికల్ వేలో చూస్తారా..? అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి హాని రోజు ఖాతాలో మరో హిట్ పక్కా అని మాత్రం చెప్పొచ్చు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!