`కొత్త బంగారు లోకం` వంటి సూప‌ర్ హిట్ ను మిస్ చేసుకున్న ఇద్ద‌రు అన్ ల‌క్కీ హీరోలెవ‌రో తెలుసా?

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంట‌గా న‌టించిన యూత్ ఫుల్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `కొత్త బంగారు లోకం`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రకాష్ రాజ్, జ‌య‌సుధ‌, రావు రామేష్‌, ఆహుతి ప్రసాద్, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

మిక్కీ జె. మేయర్ కొత్త బంగారు లోకంకి స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా.. 9 అక్టోబర్ 2008న సినిమా విడుదలైంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను అందుకుని సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇప్ప‌టికీ యూత్ మోస్ట్ ఫావ‌రెట్ చిత్రాల్లో కొత్త బంగారు లోకం ఒక‌టి అన‌డంలో సందేమం లేదు. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ కు ఫ‌స్ట్ ఛాయిస్ వ‌రుణ్ సందేశ్ కాదు.

మొద‌ట కొత్త బంగారు లోకం మూవీని శ్రీ‌కాంత్ అడ్డాల నాగ చైత‌న్య‌తో చేయాల‌ని అనుకున్నాడు. నాగ‌చైత‌న్య‌ను హీరోగా ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నాల్లో నాగార్జునకు శ్రీ‌కాంత్ అడ్డాల క‌థ కూడా వినిపించారు. కానీ, నాగార్జున మాత్రం ఇటువంటి స్టోరీ త‌న కొడుక్కి సెట్ కాద‌ని తిర‌స్క‌రించారు. ఆ త‌ర్వాత యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ రామ్ పోతినేనితో ఈ సినిమా చేయాల‌ని శ్రీ‌కాంత్ అడ్డాల అనుకున్నాడు. అయితే రామ్ ఇంట‌ర్ మీడియ‌ట్ కుర్రాడి పాత్ర‌ను చేయ‌డం ఇష్టంలేక నో చెప్పాడు. అలా నాగ చైత‌న్య‌, రామ్ నుంచి చేజారిన కొత్త బంగారు లోకం.. వ‌రుణ్ సందేశ్ ఖాతాలో సూప‌ర్ హిట్ గా ప‌డింది.