గ్రహణం సమయంలో ఈ తప్పులను చేయకండి..!!

మన పూర్వం నుంచి ఎన్నో సాంప్రదాయాలు మనం పాటిస్తూనే ఉంటాము ముఖ్యంగా గ్రహణం సమయంలో చాలామంది కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు.. ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన అంటే ఈ రోజున ఏర్పడుతోంది దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే గ్రహాన్ని సైతం చూడాలనుకునే వారు పలు జాగ్రత్తలు తీసుకొని చూడాలని వేద పండితుల సైతం తెలియజేస్తున్నారు. లేకపోతే చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుందట.


ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన నవరాత్రులు మొదలు కాబోతున్నాయి.. అయితే ఈ నవరాత్రులకు ఒక్కరోజు ముందు ఈరోజు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సంవత్సరం ఇది రెండవ మరియు చివరి సూర్యగ్రహణం అని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు సూర్య కిరణాలు భూమిని చేరదట. దీనినే సూర్యగ్రహణం అని పిలుస్తూ ఉంటారు.. కొన్ని నమ్మకాల వల్ల గ్రహణం ఏర్పడడం అనేది అశుభంగా భావిస్తూ ఉంటారు.

ఈ సూర్య గ్రహణం కెనడా ,మెక్సికో, ఉత్తరా అమెరికా తదితర దేశాలలో మాత్రమే కనిపిస్తోంది. వీటినీ చూడడానికి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆత్రుతగా ఉంటారు. అయితే సూర్యగ్రహణం సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చూడవచ్చు.. సూర్య గ్రహాన్ని నేరుగా కంటితో అసలు చూడకూడదు.. దీనివల్ల కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుందట. అందుకే గ్రహాన్ని చూడాలి అంటే కంటికి రక్షణగా ఏదైనా పెట్టుకోవడం చాలా మంచిది.

సూర్యగ్రహణం రోజున సూర్య రష్మి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మన కంటి చూపుని దెబ్బతినేలా చేస్తుంది. గ్రహణం చూడటానికి మనం టెలిస్కోప్ లేదా కెమెరాను మాత్రమే ఉపయోగించడం చాలా మంచిది.. గ్రహణాన్ని చూడడానికి సన్ గ్లాస్ అసలు ఉపయోగించకూడదు.. గ్రహణం ఏర్పడ్డ సమయంలో బయట ఉంటే సూర్యుడి కిరణాలు చాలా హానికరంగా మారుతాయి. ఎక్సరే వాటితో కూడా సూర్యగ్రహణం చూడవచ్చు. సూర్యగ్రహణం సమయంలో పిల్లల్ని ఒంటరిగా విడిచి పెట్టకూడదు.