బాల‌య్య‌ అన్ స్టాపబుల్ 3 ప్రోమో అదుర్స్‌.. మేము త‌ప్పు చేయ‌లేదు.. త‌ల వంచ‌ము.. ( వీడియో)

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ హీరోగా, రాజకీయ నాయకుడిగా అందరికీ పరిచయం ఉన్న వ్య.క్తి కానీ ఆయనను దగ్గరగా చూడడం అంటే ఏదైనా సినిమా ఈవెంట్స్ లోనో, ఇంటర్వ్యూలోనో ఆయన మాట్లాడడం తప్ప.. బుల్లితెర ప్రేక్షకులకు అంతగా కనిపించరు. కానీ ఒకే ఒక్క షో బాలయ్యను అందరికీ దగ్గర చేసింది. చిన్న, పెద్దా అని తేడా లేకుండా బాలయ్య క్రేజ్.. బాలయ్య పేరు అందరి నోట మారుమోగిపోయేలా చేసింది అన్‌స్టాపబుల్.

ఈ షో మొదలైనప్పుడు బాలయ్య హోస్ట్ అంటే అందరూ బాలయ్య షో ఎలా చేయగలడు.. తడపడతాడు, కోప్పడతాడు అని అనుకున్నారు. కానీ ఒకసారి షో మొదలయ్యాక అనుమానాలన్నీ పటా పంచలు అయ్యాయి. అన్‌స్టాపబుల్ సీజన్ వన్ బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఇక అదే జోరుతో సీజన్ 2తో వచ్చాడు. స్టార్ హీరోలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇప్పుడు మూడో సీజన్ తో బాలకృష్ణ రావడానికి రెడీ అయ్యాడు. తాజాగా మూడో సీజన్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. లిమిటెడ్ ఎడిషన్ అంటూ వస్తున్న ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్లో భగవంత్ కేసరి టీమ్ సంద‌డి చేశారు.

ఈ షోలో అనిల్ రావిపూడి, కాజల్, శ్రీ‌లీల, అర్జున్ రామ్‌పాల్ విచ్చేసి వేదికను మెరిపించారు. మేము తప్పు చేయలేదని మీకు తెలుసు.. తలవంచమని మీకు తెలుసు.. నన్ను ఆపడానికి ఎవడు రాలేడని మీకు తెలుసు.. అనిపించింది అందాం, అనుకున్న‌ది చేద్దాం అంటూ బాలయ్య మార్క్ పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రోమో మొదలైంది. ఇక అనిల్ రావిపూడి తో బాలయ్య ఒక ఆట ఆడుకున్నాడు. కాజల్ మోక్షజ్ఞతో నటిస్తావా అని అడగడం ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుంది. బాలయ్య వారితో మాట్లాడిన సెన్స్ఆఫ్ హ్యూమర్.. నచ్చి అనిల్ రావిపూడి బాలయ్యతో కామెడీ సినిమా చేస్తాను అంటూ మాటిచ్చాడు.

ఇక ఇదే వేదికపై తమన్నతో.. అనిల్ రావిపూడిని గొడవ గురించి అడగగా.. అనీల్ స్పందిస్తూ మీరు బాలయ్య బాబు కాదు ఫిట్టింగ్ బాబు అంటూ కామెంట్స్ చేశాడు. ఇక సినిమా లైఫ్ అంతా బాగుంది అనుకున్నప్పుడు ఒకడు వస్తాడు నాశనం చేయడానికి.. అప్పుడు హీరో జైలు నుంచి వస్తాడు.. అని బాలయ్య చెప్పిన మాటలు చంద్రబాబును ఉద్దేశించి అన్నట్లు ఉండడంతో ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అక్టోబర్ 17 న 6 గంటలకు ఈ షో ఆహ‌మాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ షో చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.