బచ్చలి ఆకుకూర తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా..?

మన చుట్టూ దొరికేటువంటి ఆకుకూరలలో పలు రకాల పోషకాలు ఉంటాయి. ఇలాంటి వాటిలలో పచ్చి ఆకుకూరలు చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయి ముఖ్యంగా బచ్చలి ఆకుకూరలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వాస్తవానికి ఆకుకూరలు ఏవైనా సరే మనిషి ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మేలు చేసే పోషకాలను అందిస్తాయి.

గుండె సమస్యతో ఇబ్బంది పడేవారు ఆకుకూరలను తినడం చాలా మంచిది. బచ్చలి ఆకుకూరలలో ఉండే నీరు ఇతర పానీయాలు హైడ్రేట్ గా ఉంచడానికి చాలా ఉపయోగపడతాయట. బచ్చలాకును స్నాక్స్ గా కూడా చేసుకొని మనం తినవచ్చు. ఇందులో ఎక్కువ మోతాదులలో మెగ్నీషియం, పొటాషియం, ఇనుము విటమిన్స్, కాల్షియం వంటివి అధికంగా లభిస్తాయి. దీనివల్ల మనకు ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుందట. బచ్చలకూర వంటి మొక్కలలో తైలాకోయిడ్ పదార్థాలు కలిగి ఉండడం వల్ల ఆకలి వేయకుండా ఉంటుందని అధ్యయనంలో తెలియజేయడం జరిగింది వైద్యులు.

బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో కూడా ఈ బచ్చలి ఆకుకూరలు చాలా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ కె ,మాంగనీస్ ,క్యాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యమైన ఎముక తయారీకి సహాయపడతాయి. నిత్యం ఎముకల కణజాలాన్ని తొలగిస్తూ పునరుద్దిస్తూ ఉంటాయట. బచ్చలాకుకూరను ఏ రూపంలో తిన్న ఎముకలు బలంగా ఉంటాయట.

బచ్చలాకు కూరల్లో ఇనుము లోపం ఉండకుండా చేస్తుంది. ఇనుము లోపం వల్ల తల తిరగడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కలుగచేస్తాయి. అందుకే వీటిని తరచూ తింటూ ఉండడం మంచిది.

ప్రస్తుతం ఉన్న కాలంలో వైరస్ బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది .ఇలాంటి వైరస్ బారిన పడకుండా ఉండేందుకే ఇందులో టాక్సిస్ వంటి పదార్థం ఉంటుందట.

శరీరంలో చెడు కొవ్వు పదార్థాలను సైతం పేరుకుపోకుండా ఉంచుతూ ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తుంది ఈ బచ్చలాకు.