వన్డే ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది ఎవ‌రంటే..

వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో అహ్రాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మెగా ఈవెంట్ కు తెరలేవనుంది. తొలి మ్యాచ్ లో ఢిఫెడింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మెగా టోర్నీ నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన టాప్ 5 ఆటగాళ్లు ఎవ‌రో చూద్దాం. వన్డే ప్రపంచ కప్ చరిత్రలు అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన రికార్డ్ ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉంది.

భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్ లో ఓబ్రియన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అతడు కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. ఆరవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఓబ్రియన్ బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్లో 63 బంతులు ఎదుర్కొన్న కెవిన్ 13 ఫార్లు, 6 సిక్స్ లతో 113 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్పై 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో అతడు కీలక పాత్ర వహించాడు. అతడి ఇన్నింగ్స్ ప్రపంచ కప్ చరిత్రలోనే చిరస్మరణీయంగా మిగిలిపోయింది.

ఈ జాబితాలో ఓబ్రియన్ తర్వాత స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ఉన్నాడు. సొంత గడ్డపై జరిగిన 2017 వన్డే ప్రపంచ కప్ లో కేవలం 51 బంతుల్లోనే మాక్స్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్లో మాక్స్ వెల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో 53 బంతులు, 10 ఫార్లు,4 సిక్స్ లతో 102 పరుగులు చేశాడు. ఇక లిస్టులో మాక్స్ వెల్ తరువాత దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2017 ప్రపంచ కప్ లో వెస్ట్ ఇండియాస్ పై వెస్ట్ండీన్ పై కేవలం 52 బంతుల్లోనే డివిలియర్స్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో 62 బంతులు ఆడిన ఏబీడీ.. 17 ఫోర్లు, 8 సిక్స్ లతో 162 పరుగులు చేశాడు.

ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సంత గడ్డపై జరిగిన 2019 వన్డే ప్రపంచ కప్లో మోర్గాన్ 57 బంతులలో తన సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్ గా 71 బంతులు, 4 ఫార్లు , 17 సెంచరీలతో 148 పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో ఐదో స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగజం మాథ్యూ హేడెన్ ఉన్నాడు. 2007 వన్డే ప్రపంచ కప్ లో హేడెన్.. దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో శతకాన్నీ సాధించాడు. మొత్తంగా 68 బంతులు ఎదుర్కొన్న హేడెన్ 14 ఫార్లు, 4 సిక్సులతో 101 పరుగులు చేశాడు.