బిగ్‌బాస్ ఓటింగ్‌లో ఊహించని పరిణామం.. ఈ వారం అతడు ఎలిమినేట్..?

బిగ్ బాస్ -7 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా ట్యాగ్‌లైన్‌లో వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులకు బోల్డెంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. దీంతో గత సీజన్‌తో పోలిస్తే రేటింగ్స్ బాగానే వస్తున్నాయి. గత షోలలో ఇచ్చిన టాస్క్‌లు కాకుండా కొత్త టాస్క్‌లు ఇవ్వడంతో ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం, నామినేషన్, ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆసక్తి కల్గిస్తున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చివరి వరకు కూడా తెలియడం లేదు. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకులు ఉత్కంఠతో చూస్తున్నారు.

అయితే ఈ వారం నామినేషన్స్ లో శివాజీ, ప్రిన్స్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, టేస్టీ తేజా, అమర్ దీప్ ఉన్నారు. వీరిలో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఓటింగ్స్ లో రోజురోజుకు పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే.. హీరో శివాజీ టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో ప్రిన్స్ యావర్ ఉండగా.. మూడో స్థానంలో అమర్ దీప్ కొనసాగుతున్నాడు. ఇక శుభశ్రీ నాలుగో స్థానంలో ఉండగా.. ప్రియాంక ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక చివరి రెండు స్థానాల్లో గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ ఉన్నారు.

గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ మధ్య ఓట్ల వ్యత్యాసం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం టేస్టీ తేజా ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది. గత వారంలో కూడా తేజా ఓటింగ్స్ లో వెనకపడ్డాడు. ఈ సారి అతడి ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం. ఇక ఆరుగురు కంటెస్టెంట్స్ కొత్తగా హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అక్టోబర్ 8న ఆదివారం మినీ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించేందుకు కసరత్తులు జరుగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వనున్నారు.