మీ పాన్ కార్డు పోయిందా.. పది నిమిషాల్లో సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!!

పాన్ కార్డు కేవలం ఒక్కదానికే పరిమితం కాకుండా క్రెడిట్ కార్డ్ కు అప్లై చేసుకోవడం మొదలు, డి మ్యాట్ అకౌంట్ ఓపెన్, ఎల్ఐసీ ప్రీమియం, షేర్ మార్కెట్ ఇలా ప్రతిదానికి పాన్ కార్డ్ ఉండాల్సిందే. నిత్యజీవితంలో పాన్ కార్డ్ ఇప్పుడు ఓ భాగం అయిపోయింది. పాన్ కార్డ్ భారతదేశ ఆదాయపు శాఖ జారీ చేస్తుంది. పాన్ కార్డును జాతీయ గుర్తింపు కార్డుగా పరిగణంలోకి తీసుకుంటున్నారు. 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ తో ఈ పాన్ కార్డును తయారు చేస్తారు. పాన్ కార్డ్ ఒకప్పుడు కేవలం కొందరికి మాత్రమే తెలిసినా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి పాన్ కార్డు పై అవగాహన పెరిగింది.

టూవీలర్ నుంచి అన్ని రకాల వాహనాలు కొనుగోలు చేయాలంటే పాన్ కార్డు కావాల్సిందే. ఇక బ్యాంక్ అకౌంట్ లో రూ. 50వేలకు మించి జమ చేయాలంటే కూడా పాన్ కార్డ్ ఉండాల్సిందే. అయితే కొందరు పాన్ కార్డ్ ని ఆదమరుపులో ఎక్కడో అక్కడ మర్చిపోవడం, పడేయడం లాంటివి చేస్తారు. అప్పుడు వారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు.. ఇప్పుడు చెప్పే వార్త వాళ్లకోసమే… మీ పాన్ కార్డ్ అవసరం లేకుండా పది నిమిషాల్లోనే పాన్ కార్డును ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

* ఇ-పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మొదట ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ లోకి లాగిన్ అవ్వాలి.

*అనంతరం హోం పేజ్ లో కనిపించే ఇన్‌స్టాంట్‌ ఈ-పాన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

*తర్వాత ఇ-పాన్ పేజీ ఓపెన్ చేసి గెట్ న్యూ ఇ- పాన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

* అనంతరం ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయాలి.

* వెంటనే మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఓటిపి వెళ్తుంది. సదరు నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి.

* యూఐడీఏఐతో ఆధార్ వివరాలను కన్ఫామ్ చేసుకోవడానికి చెక్ బ్యాక్ ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పై క్లిక్ చేయాలి.

* ఆధార్ వివరాల వెరిఫికేషన్ పేజీలో ” అగ్రీ ” చెక్ బ్యాక్ ను పెంచుకొని.. కంటిన్యూ పై క్లిక్ చేయాలి.

* చివరిగా మీ మొబైల్ ఫోన్కు సక్సెస్ అయినట్లు మెసేజ్ వస్తుంది. దానిని ఐడీగా గుర్తుంచుకోవాలి.

*ఇక చివరగా మీ యూజర్ ఐడి, పాస్పోర్ట్లతో ఇ-ఫైలింగ్ పార్టల్ కి లాగిన్ అవ్వాలి. తర్వాత డ్యాష్ బోర్డ్లో సర్వీస్ ఇ-పాన్ వ్యూ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

*తర్వాత 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి క్లిక్ చేయడం. వెంటనే మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. దానిని సదరు బాక్స్ లో ఎంటర్ చేస్తే వెంటనే మీ పాన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.