ప్రభాస్‌ను అలా చూపించండి. మంచు విష్ణుకు రిక్వెస్ట్

సినీ హీరో మంచు విష్ణు కన్నప్ప పేరుతో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను తీస్తున్నాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దాదాపు రూ.100 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురావాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో శివుడు పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు.

అయితే కన్నప్ప మూవీలో నయనతార కూడా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. ఇది ఇలా ఉంచితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఒక ఏఐ జనరేటెడ్ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో శివుడు లుక్ లో ప్రభాస్ ఉండగా.. డార్లింగ్ లుక్ ఫ్యాన్స్ కు తెగ నచ్చింది. దీంతో ఈ ఫొటోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ట్రెండింగ్ సృష్టిస్తున్నారు. ఈ సందర్బంగా మంచు విష్ణుకు పలు అభ్యర్థనలు చేస్తున్నారు.

ఈ ఏఐ జనరేటెడ్ ఫొటోలో ఉన్నట్లుగాన ప్రభాస్‌ను శివుడి పాత్రలో చూపించాలని మంచు విష్ణును డార్లింగ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. కనీసం అలా చూపించేందుకైనా ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ అభిమానుల రిక్వెస్ట్ పై మంచు విష్ణు స్పందిస్తాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాలో భారీ తారాంగణం ఉండనుంది. స్టార్ హీరోలు, హీరోయిన్లను ఎంపిక చేయనున్నారు. త్వరలో మిగతా పాత్రలకు సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. మైథలాజికల్ మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో బారీగా అంచనాలు ఉన్నాయి.