బోడ కాకరకాయ తింటే ఇన్ని లాభాలా.. మరి ధర ఎంతో తెలుసా….!!

బోడ కాకరకాయలు చాలా అరుదుగా కనిపిస్తాయి. బోడ కాకరకాయ తింటే ఎన్నో లాభాలు ఉంటాయి. వాటి ధర, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

1. ప్రతియేట వర్షాకాలం సమయంలో బోడ కాకరకాయ పంట చేతికి వస్తుంది. ఈ సీజన్లో బోడ కాకరకాయకి మంచి డిమాండ్ ఉంటుంది.

2. ఎందుకంటే ఈ సమయంలో ఈ బోడ కాకరకాయ తింటే ఆరోగ్యం విషయంలో ఎన్నో లాభాలు ఉంటాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఈ కాకరకాయలో రుచితో పాటు పోషకాలు కూడా సమృద్ధిగా వుంటాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో ఈ బోడ కాకరకాయ ఎక్కువగా పండేది.

3. ఇప్పుడు దిగువ ప్రాంతం రైతులు కూడా పండిస్తున్నారు. అయితే ప్రారంభ దిశలో కేజీ రూ. 150 రూపాయలు వరకు ధర ఉండేది. ఇప్పుడు 80 రూపాయలు వరకు ఉంటుంది. ప్రారంభ దిశ కావడంతో కాకరకాయ 150 రూపాయలు వరకు ధర వస్తున్న.. ఆఖరి దిశకు చేరుకునేసరికి 50 రూపాయలు కూడా వస్తుంది.

4. ఈ ఏడాది ముందుగా వర్షాలు సక్రమంగా లేకపోవడంతో బోడ కాకరకాయ తీగలు పెరగలేదని.. దీని ఫలితంగా ధర పెరిగిందని రైతులు అంటున్నారు. ఈ వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయలు, పండ్లు పంటలు బాగా పండుతాయి. ఈ పంటలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అని రైతులు చెబుతున్నారు.

5. వర్షాకాలంలో మాత్రమే అరుదుగా దొరికే బోడ కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడుతాయి. అందువల్ల బోడ కాకరకాయ ఎక్కువ తినడం చాలా మంచిది.