ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ఇటీవల ముంబైకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయ్యప్ప మాల విరమణ కోసం ముంబైకి చరణ్ వెళ్లాడంటూ న్యూస్ వైరల్ అయింది. అయితే ప్రస్తుతం చరణ్‌కి సంబంధించిన మరో క్రేజీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాజి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే టైంలో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారని అంశం చర్చినియాంశంగా మారింది. ఈరోజు ఉదయం రామ్‌చరణ్ ముంబైలోని ప్రసిద్ధి వరసిద్ధి వినాయకుని టెంపుల్ లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామిమాల విరమణ సందర్భంగా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రామ్ చరణ్ కు అర్చకులు, ఆలయ సిబ్బంది దర్శనానికి తగిన ఏర్పాట్లు చేశారు. వినాయక దర్శనం అనంతరం శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలతో పాటు ధోనితో కలిసి రామ్ చరణ్ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
కాగా వారిద్దరూ ఒక కమర్షియల్ యాడ్లో నటించబోతున్నట్లు అందుకే ఒకచోట కలిసినట్లు సమాచారం. ఇక ఈ షూట్ తర్వాత చరణ్ హైదరాబాద్‌కి రానున్నాడు. చరణ్ సినిమాల విషయానికొస్తే డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించబోతున్నాడు. దీంతో పాటు చరణ్ వరుస పాన్ ఇండియా సినిమా లైన్లో పెట్టినట్లు సమాచారం.