టాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన హెబ్బా పటేల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కుమారి 21F చిత్రంలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి యంగ్ హీరోల సరసన నటించిన ఇటీవల కాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. తాజాగా హెబ్బా పటేల్ నటించిన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అని వెబ్ సిరీస్ ఆహాలు ఈనెల 6వ తేదీన స్ట్రిమింగ్ కాబోతోంది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.
ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో సదర్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఫస్ట్ బాగానే ఉన్నానని చెప్పినా హెబ్బా పటేల్ ఆ తర్వాత అర్థం కాక అయోమయంలో ఫేస్ పెట్టి చివరకు హర్ట్ అయ్యి ఇంటర్వ్యూ నుంచి లేచి వెళ్లిపోయినట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇది ఫ్రాంక్ వీడియో కాదని నిజంగా జరిగిందని తెలుస్తోంది. ముందుగా హెబ్బా పటేల్ రాగానే యాంకర్ ఇలా అడుగుతూ.. మీ మూడ్ బాగుందా అంటూ ప్రశ్నించారు.
అందుకే హెబ్బా పటేల్ కూడా మొదట ఆ ఓకే అంటూ సమాధానం ఇవ్వగా యాంకర్ దాన్ని మరింత పొడిగిస్తూ మీ మూడ్ ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు అందుకే ముందే అడుగుతున్నాను మీతో మాట్లాడొచ్చా అంటూ అడగక హెబ్బా పటేల్ కు అర్థం కాకపోవడంతో..మీరు ఫ్రీగానే ఉన్నారా మీ మూడ్ బాగుందా అని మాత్రమే అడిగానని అనేసరికి మూడ్ తో కనెక్షన్ ఏముంది.. ఇది ప్రమోషన్స్ కదా అని ప్రశ్నిస్తూ.. తాను ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకోవడం లేదంటే సీరియస్గా లేసి వెళ్ళిపోయింది అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.
🤣🤣🤣 ~ #HebahPatel pic.twitter.com/Hn8mEY8N22
— Anchor_Karthik (@Karthikk_7) October 3, 2023