అదిరిపోయే కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్.. ఇది కదా నిజమైన పాన్ ఇండియా మూవీ అంటే..?!

కే జి ఎఫ్ సిరీస్ లతో భారీ సక్సెస్ అందుకున్నాడు యష్. ఈ సినిమా తర్వాత ఎటువంటి ప్రాజెక్టును ఎంచుకోవాలి అని ఆలోచనలో ఉన్న య‌ష్‌ సినిమా హిట్ కొట్టి ఏడాది అవుతున్న ఇప్పటివరకు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తను తర్వాత నటించబోయే సినిమా పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలని ఉద్దేశంతోనే ఇప్పటివరకు ఏ సినిమాను ఓకే చేయ‌ని య‌ష్‌ తాజాగా ఓ సినిమాలో కీలకపాత్రలో నటించడానికి ఓకే చెప్పాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పటినుంచో రామాయణం తర్కెక్కించాలని బాలీవుడ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆది పురుష్‌ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో వివాదాలు కూడా దారితీసింది. అయితే ఈసారి పలు జాగ్రత్తలు తీసుకొని పగడ్బందీగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. దీనికి తగ్గ కాస్ట్ ను కూడా ఫైనల్ చేశారు. ఇక ఈ పాన్ ఇండియా లెవెల్ మూవీలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. సినిమాలో రావణుడిగా యష్‌ను తీసుకున్నారట. గతంలో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను తెర‌కెక్కించిన నితీష్ తివారి డైరెక్షన్లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుంది. 2024 జూన్ లో ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఆది పురుష్‌ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం విఎఫ్‌ఎక్స్ అందుకే ఈ సినిమాకి నితీష్ తివారి ఆస్కార్ విన్నింగ్ విఎఫ్‌ఎక్స్ టీమ్‌ను రంగంలోకి దింపుతున్నాడట. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాలకు భారతదేశంలో అత్యున్నత టెక్నీషియన్స్ ఉపయోగించబోతున్నారని తెలుస్తుంది.

 

ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు మేకర్స్. మొదటి భాగంలో రావణుడి సన్నివేశాలు తక్కువగా ఉండటం వల్ల య‌ష్ కేవలం 10 నుంచి 20 రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొంటాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అదిరిపోయే కాంబినేషన్ అంటే ఇదే కదా.. అసలు పాన్ ఇండియా మూవీ అంటే ఇలాంటి కాంబో ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నిట్టిజ‌న్‌లు.