బాలీవుడ్ స్టార్ కపుల్స్ లిస్ట్ లో దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి. 2013లో వచ్చిన `రామ్-లీలా` సినిమాలో వీరిద్దరూ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పుడే దీపికా పదుకొనేతో రణ్‌వీర్ సింగ్ ప్రేమలో పడ్డాడు. చాలా ఏళ్లు వీరి మధ్య ప్రేమాయణం నడిచింది. ఫైనల్ గా 2018లో రణ్‌వీర్ తో దీపికా ఏడడుగులు వేసింది.
పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఇటలీలోని లేక్ కోమోలో వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన 5 ఏళ్లకు దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్ వెడ్డింగ్ వీడియో బయటకు వచ్చింది. రీసెంట్ గా ఈ లవబుల్ కపుల్.. కరణ్ జోహార్ టాక్ షో `కాఫీ విత్ కరణ్` 8వ సీజన్ తొలి ఎపిసోడ్ కు గెస్ట్ లుగా హాజరు అయ్యారు.
అయితే ఈ షోలోనే కరణ్.. దీపికా-రణ్‌వీర్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియోను ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రణ్‌వీర్ తన ప్రేమను దీపికాకు ప్రపోజ్ చేయడం, ఎంగేజ్మెంట్, మెహందీ వేడుక, పెళ్లి, రణవీర్ డ్యాన్స్ చేయడం, దీపికా అందంగా ముస్తాబవడం.. ఇలా అన్నీ వీడియోలో చూపించారు. ఎంతో అద్భుతంగా ఉన్న దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్ వెడ్డింగ్ వీడియోకు అందరూ ఫిదా అయిపోతున్నారు. మరి లేటెందుకు మీరు ఆ వీడియోపై ఓ లుక్కేసేయండి.
View this post on Instagram