పెళ్లి కాకముందే అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన జాన్వీ..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ పెళ్లికాకముందే అభిమానులకి గుడ్ న్యూస్ అందజేస్తున్న విషయాలు మనకు తెలిసిందే.  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అదే కోవాలోకి వస్తుంది . పెళ్లైన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చి 9 నెలల తర్వాత పండు లాంటి పాపకు జన్మదిన అలియా భట్ రీసెంట్ గానే నేషనల్ అవార్డు అందుకుంది . ఆ విషయం పక్కన పెడితే..  తాజాగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సైతం అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది .

అయితే ఇది మీరు అనుకుంటున్నా గుడ్ న్యూస్ కాదండోయ్ ..ఇది వేరే గుడ్ న్యూస్.. పెళ్లి కాకముందే తనకంటూ ఓ సొంత  ఇల్లు కొనుగోలు చేసుకుని తన కాళ్లపై తాను నిలబడింది జాన్వి కపూర్ . శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.  పెద్దగా చెప్పుకోతగ్గ  పాత్రలు చేయలేదు కానీ ..క్రేజ్ మాత్రం బాగా సంపాదించుకుంది .

తెలుగులో దేవర సినిమాతో డెబ్యూ ఇవ్వబోతుంది . అయితే రీసెంట్గా ఆమె ముంబైలో తన సొంత డబ్బులతో ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు జాన్వికపూర్ రెండు మూడు ఫ్లాట్లు కొనింది.  కానీ అది ఎంత శ్రీదేవి సంపాదన.  ఫస్ట్ టైం తన సొంత డబ్బులతో ఆమె ఇల్లు కొనుక్కుంది . ముంబైలోని ఓ  ఏరియాలో అత్యంత విలాసకరవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది.   దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతున్నాయి..!!