మా ఆయనతో కంటే ఆ హీరో తోనే నాకు కెమిస్ట్రీ బాగుంటుంది.. టంగ్ స‌లిప్ అయిన దీపికా..

పొడుగు కాళ్ళ సుందరి దీపికా పదుకొనేకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో తిరుగు లేని పాపులారిటీ ద‌క్కించుకున్న దీపిక ఇటీవల రన్‌వీర్‌తో కన్నా నాకు ఆ హీరో తోనే మంచి కెమిస్ట్రీ ఉందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జవాన్, గేహరీయాన్‌ సినిమాల్లో అంగాంగ దర్శనమిస్తూ ముద్దు సీన్లతోను నిత్యం వార్తల్లో నిలిచి పలువురి విమర్శలను ఎదుర్కొంటున్న ఈ బ్యూటీ ఇటీవల భర్త సమక్షంలోనే టంగ్ స్లిప్ అయింది. దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న టీవీ షో కాఫీ విత్ కరెణ్ సీజన్ 8 లో భర్తతో కలిసి పాల్గొంది.

ఈ షో త్వరలోనే టెలికాస్ట్ కానుంది. ఈ క్రమంలో ఫస్ట్ ఎపిసోడ్‌కు హాజరైన రణ్‌వీర్ కపూర్ – దీపికా పదుకొనే జంట వారి పర్సనల్ లైఫ్ కు, సినిమాలు కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాన్ని వివరించారు. అయితే ఈ షో కి సంబంధించిన ప్రోమో మంగళవారం రిలీజ్ కాగా.. నెట్టింట‌ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటివరకు ఏడు భాగాలతో వచ్చిన ఈ కాఫీ విత్ క‌ర‌ణ్‌లో రణ్‌వీర్, దీపిక విడివిడిగా పాల్గొన్నారు. కానీ జంటగా పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ ప్రోమోలో కరణ్‌ జోహార్.. మీకు రణవీర్ తో కాకుండా ఇండస్ట్రీలో మరే హీరోతో కెమిస్ట్రీ బాగా వర్క్ అవుతుంది అనుకుంటున్నారు అని అడిగాడు.

దీనికి దిపిక రిప్లై ఇస్తు హృతిక్ తో మంచి బాండింగ్ ఉంటుందని భావిస్తున్నా.. అతనితో స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని దీపిక చెప్పింది. దీంతో రణ్‌వీర్ షాక్ అయ్యారు. సినిమాలో రణ్‌వీర్‌తో నాలుగు సినిమాలు, షారుక్‌తో 5,6 సినిమాలు చేసిన దీపిక వీరిద్దరి పేర్లలో ఎవరో ఒకరి పేరు చెబుతుందని అందరు భావించారు. కానీ హృతిక్ రోషన్ పేరు చెప్పడంపై కారణమేంట అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే హృతిక్ – దీపిక మొదటిసారిగా ఫైటర్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు.