టాలీవుడ్ హీరోయిన్ పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన RX -100 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను అందుకోలేకపోయింది. కుర్ర హీరోల సినిమాలలో నటిస్తున్న అవి కూడా పెద్దగా కలిసి రావడం లేదు.
ఆడప దడపా సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మళ్లీ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే సినిమాలో నటించింది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ,ట్రైలర్ ,పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈసారి కచ్చితంగా పాయల్ సరైన విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ అమ్మడు ఈ సినిమా తనకు కం బ్యాక్ సినిమా అన్నట్టుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఇందులో పాయల్ నటన అద్భుతంగా ఉందని నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్ ఏరియాలలో దాదాపుగా 7 కోట్లకు పైగా సింగిల్ పాయింట్తో అమ్మేసినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ను చూసి కొనుక్కున్నట్లు తెలుస్తోంది.. దాదాపుగా ఆంధ్రాలోనే 6 కోట్ల రూపాయలకు కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిబట్టి చూస్తే దాదాపుగా ఈ సినిమా కొన్న బయ్యర్లకు 80 లక్షల రూపాయలు లాభం వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాతో పాయల్ రేంజ్ కూడా పెరిగిందని తెలుస్తోంది మరి ఏ మేరకు ఈమె కెరియర్ కు సక్సెస్ అవుతుందో చూడాలి