చీర‌లో మిస్మ‌రైజ్ చేసిన మెహ్రీన్.. ఇంత అందంగా ఉంటే ఎలా హ‌నీ?!

అందాల భామ మెహ్రీన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `కృష్ణ గాడి వీర ప్రేమ గాథ` మూవీతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మెహ్రీన్‌.. తొలి సినిమాతోనే త‌న అందం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది.

మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో భారీ క్రేజ్ సంపాదించుకుంది. హిందీ, పంజాబీ, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లోనూ పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ `స్పార్క్` అనే మూవీలో న‌టిస్తోంది. తెలుగు తమిళం బైలింగ్వుల్ మూవీ ఇది. ఈ సినిమాతో విక్రాంత్ హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. అలాగే ఇటీవ‌ల `సుల్తాన్‌ ఆఫ్ ఢిల్లీ’ అనే వెబ్‌సిరీస్ తో మెహ్రీన్ డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సిరీస్‌లో కథ డిమాండ్‌ చేయడం వల్ల కొన్ని బోల్డ్‌ సన్నివేశాల్లో నటించి వార్త‌ల్లో హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే మెహ్రీన్‌.. తాజాగా డ‌బుల్ షేడ్ శారీలో ద‌ర్శ‌న‌మిచ్చిన త‌న అందాల‌తో మిస్మ‌రైజ్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని బ్యాక్ అండ్ ఫ్రెంట్ అందాలు చూపిస్తూ అల్లాడించింది. పద్ధతిగా క‌నిపిస్తూనే కుర్రాళ్ల గుండెల్లో మంట‌లు రేపింది. మెహ్రీన్ తాజా ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. ఇంత అందంగా ఉంటే ఎలా హ‌నీ అంటూ నెటిజ‌న్లు కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)