గోంగూరతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని తెలుసా..?

ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు వెల్లడించారు. వాటిలో గోంగూర కూడా ఒకటి. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఆకుకూరతో పప్పు, పచ్చడి, గోంగూర రైస్ అంటూ చాలా రకాల వంటకాలు చేసుకొని తింటారు. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గోంగూర లో విటమిన్ సి, విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9 , మెగ్నీషియం, క్యాల్షియం, పాస్వరస్, ఐరన్ ఇలా అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి, వారంలో రెండు సార్లు అయినా గోంగూర తింటే చాలా మంచిది.

2. దీనిలో ఉండే క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఈ గోంగూరని హ్యాపీగా తినొచ్చు. అంతేకాకుండా దీనిని పులిహోరలా చేసుకొని కూడా తినొచ్చు.

3. గోంగూరలో పొటాషియం, మెగ్నీషియం ఉండడం వల్ల హై బీపీని తగ్గిస్తుంది. వారంలో మూడు నాలుగు సార్లు తీసుకుంటే హైబీపీని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది.

4. అలాగే గోంగూర తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.

5. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యంగా, మొహం సౌందర్యంగా కనిపించడానికి గోంగూర చాలా బాగా ఉపయోగపడుతుంది.