సినిమాల పైన విరక్తితో అలాంటి పని చేస్తున్న స్టార్ డైరెక్టర్..!

సాధారణంగా చాలామంది సినిమాలలో అవకాశాలు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది సినీ ఇండస్ట్రీలో అన్ని అనుభవాలను చవిచూసిన తర్వాత సినిమాలపై విరక్తి కలిగి ఏదో ఒక పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివారిలోనే ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ కూడా సినిమాలకు దూరంగా వ్యవసాయం చేస్తూ తన అందమైన జీవితాన్ని మరింత అద్భుతంగా మార్చుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళితే సినిమా రంగంలో ఎక్కువగా డాక్టర్లు, ఇంజనీర్లు , ఐఐటీ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.

ఇప్పటికే బాలీవుడ్లో నితేష్ తివారి , జితేంద్ర , అమూల్, ఇలా ఎంతోమంది ఐఐటి నుంచి వచ్చిన వారే అలాగే మన్సూర్ ఖాన్ కూడా ఐఐటీ నుంచి వచ్చినవారు. బాంబే ఐఐటి నుంచి వచ్చిన ఈయన 1988లో ఖయామత్ సే ఖయామత్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై.. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇక నాలుగేళ్లకు ఒకసారి సినిమా చేస్తూ వచ్చిన ఈయన 2000 సంవత్సరంలో జోష్ సినిమా చేశారు. ఇక తర్వాత తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ హీరో గా జానే తూ జాన్ నా అనే సినిమాని నిర్మించారు. ఇక ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చేసి ఇప్పుడు 22 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నట్లు తెలుస్తోంది..

తమిళనాడు నీలగిరి కొండల ప్రాంతంలో ఈ ప్రదేశం ఉంటుంది . సముద్రమట్టానికి ఆరువేల ఎత్తు అడుగుల్లో.. ఊటీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఆయన పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. ఇక ఈ విషయంపై మన్సూర్ మాట్లాడుతూ.. నేను దర్శకుడిని అవ్వాలనుకోలేదు. సీరియస్గా నా ప్లానింగ్ లు ఇలాగే ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నానో గతంలోనే ప్లాన్ చేసుకున్నాను. అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ముంబైలో ఉండాలనుకోలేదు. నాకు సిటీలో ఉండడం నచ్చదు.. అందుకే ఇలా వ్యవసాయం చేస్తున్నాను” అంటూ ఆయన తెలిపారు.