ప్రియాంకను దారుణంగా ర్యాగింగ్ చేసిన భోలే… పాపం ఏడుపు ఒక్కటే తక్కువ (వీడియో)..!!

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. హౌస్ మేట్స్ మధ్య వార్ మాములుగా లేదని ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. హౌస్ లో ఉండేందుకు ఎవరు అనర్హులు అని భావిస్తారో వారిని ఎలిమినేట్ చేసి.. వారి ముందు ఉన్న కుండ బద్దలు కొట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ వారి కారణాలు చెబుతూ హౌస్ ని హీటెక్కించారు.

ఇక తేజ , పల్లవి ప్రశాంతును నామినేట్ చేయడానికి వెళ్లడంతో…” రారారా.. వెయిటింగ్ ” అంటూ ప్రశాంత్ ఫైర్ అయ్యాడు. ఇదంతా పక్కన పెడితే.. ప్రియాంక, భోలే మధ్య మాటలు హౌస్ లో ఉన్న వాళ్ళకి నవ్వులు పూయించాయి. ప్రియాంక భోలే ను నామినేట్ చేయగా..” రారా రారా.. నామినేషన్స్ వేసుకో ” అంటూ ఎగతాళిగా ప్రియాంకను ర్యాగింగ్ చేశాడు.

దీంతో ప్రియాంకకు చాలా కోపం వచ్చింది. ఆ టైంలో ప్రియాంక మొఖం చూస్తే ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టుగా కనిపించింది. ఆ తర్వాత భోలే వచ్చి కుండ బద్దలు కొట్టు అంటే.. ప్రియాంక మీరు కొట్టమన్నప్పుడు నేను కొట్టను అంటూ ఫైర్ అయ్యింది. అనంతరం అశ్వినిని నామినేట్ చేసింది. వీరిద్దరి మధ్య కూడా పోటాపోటీగా వాదోపవాదాలు జరిగాయి. తర్వాత అశ్వినియే తగ్గి కుండ బద్దలు కొట్టించుకుంది.