బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి… ఫ్యాన్స్‌కు ఈ ఒక్క‌ బ్యాడ్ న్యూస్ త‌ప్ప‌ట్లేదు..!

నందమూరి న‌ట‌సింహ బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల.. బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుంది. సన్‌స్క్రీన్‌ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విల‌న్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమయ్యింది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ ను ఇటీవల తాజాగా నిర్వహించారు.

ఇక అన్ని ఇంటర్వ్యూలో బాలయ్య అటెండ్ కాలేకపోయినా అనిల్ రావిపూడి, శ్రీలీల, కాజల్ పాల్గోని సంద‌డి చేస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ అని వదలకుండా అన్ని కవర్ చేస్తూ వేరే లెవల్లో ప్రమోషన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ బాలయ్య ఫ్యాన్స్ కు బాడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాలో ఓ సాంగ్ మొదటి నుంచి ఉండదట. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సాంగ్‌ను దసరా రోజు ఈ సినిమాలో యాడ్ చేస్తారట.

రిలీజ్ రోజు మాత్రం ఈ సాంగ్ సినిమాలో ఉండదు. వారం తర్వాత ఈ సాంగ్ ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోకు బాలయ్య ఫ్యాన్స్ వెళ్లకుండా ఉండరు. దీంతో మొదటి వారం రోజులు వెళ్లిన బాలయ్య ఫ్యాన్స్ కు ఈ సాంగ్ ను చూస్తే అవకాశం దక్కనట్టే.. అయితే సినిమా హిట్ అయితే దానికోసం మరోసారి సినిమాకు వెళ్తారు. కానీ మొదటివారం సినిమాకి వెళ్లేవారు మాత్రం బాలయ్య సినిమాలోని ఎమోషనల్ సాంగ్ మిస్ అవుతారు. ఇక ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజై ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.